ఆర్నాల్డ్‌కు కార్చిచ్చు ముప్పు.. టెర్మినేటర్ ప్రివ్యూ క్యాన్సిల్
లాస్ ఏంజెలెస్‌లో ప్రదర్శించనున్న టెర్మినేటర్: డార్క్ ఫేట్ సినిమా ప్రీమియర్‌ను రద్దు చేశారు. సౌత్ కాలిఫోర్నియాలో అడవులు పెద్ద ఎత్తున్న మంటలు చుట్టుముట్టడంతో ఈ నిర్ణయం తీసుకొన్నారు. హాలీవుడ్‌లోని టీఎస్ఎల్ చైనీస్ థియేటర్‌లో దీనిని ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో అడవులను కార్చిచ్చు వెంటాడటంతో ప్రీమియర్‌ను రద్దు చేస్తూ సెలబ్రిట్రీలను అక్కడి నుంచి తరలించారు. వివరాల్లోకి వెళితే..

టెర్మినేటర్ ప్రీమియర్ క్యాన్సిల్
కాలిఫోర్నియా అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతున్నాయి. దాంతో పారమౌంట్ పిక్చర్స్, స్కై డ్యాన్స్ ఈ సినిమా ప్రీమియర్‌ను క్యాన్సిల్ చేసింది అని ఓ పత్రికా ప్రకటనను రిలీజ్ చేశారు. ఈ సినిమా ప్రీమియర్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని కార్చిచ్చు బాధితులకు అందజేస్తాం. ఇందుకోసం సేవ అందిస్తున్న రెడ్ క్రాస్‌ను సంప్రదించాం అని ఓ ప్రకటనలో తెలిపారు.

ఆర్నాల్డ్‌ను సురక్షితంగా
కాలిఫోర్నియా అడవులు అగ్నికి ఆహుతి అవుతున్న నేపథ్యంలో హాలీవుడ్ హీరో ఆర్నాల్డ్‌ను ఇతర సినీ సెలబ్రిటీలను లాస్ ఎంజెలెస్ నుంచి తరలించారు. త్వరతగతిన మంటలు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పలు చర్యలను అధికారులు తీసుకొంటున్నారు.

ఆర్నాల్డ్ ట్వీట్
లాస్ ఎంజెలెస్ నుంచి మమ్మల్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు. మీలో ఎవరైనా ఆ ప్రాంతంలో ఉంటే వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లండి. ఆ చుట్టు పక్కల ఉండకండి. ఈ ఆపద సమయంలో అగ్నిమాపక నిపుణులే రియల్ హీరోలు అంటూ ఆర్నాల్డ్ ట్వీట్ చేశారు. కాలిఫోర్నియా వాసులను కాపాడే చర్యలు చేపట్టండి అంటూ అర్నాల్ సూచించారు.

నటీనటులు ఫ్యామిలీ కోసం
ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్న టెర్మినేటర్: టెర్మినేటర్: డార్క్ ఫేట్ కోసం అందరూ వేచి చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్‌కు ముందు చిత్ర యూనిట్ కుటుంబాలు, నటీనటుల ఫ్యామిలీస్‌కు ఈ ప్రీమియర్‌ను ఏర్పాటు చేశారు. కానీ అనుకోకుండా అగ్ని విపత్తు రావడంతో ప్రీమియర్ క్యాన్సిల్ చేశారు అని ఫాక్స్ న్యూస్ వెల్లడించింది.


Click it and Unblock the Notifications











