‘టెర్మినేటర్ జీనిసిస్’ ట్రైలర్-2 అదిరింది (వీడియో)

By Bojja Kumar

హైదరాబాద్: ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గెర్ హీరోగా వచ్చే హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సిరస్ ‘టర్మినేటర్' సిరీస్ చిత్రాలకు ప్రపంచ వ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో కొత్తగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఈ సీరీస్ లో వచ్చిన టర్మినేటర్-2, టర్మినేటర్-3 చిత్రాలు భారీ విజయం సాధించాయి. త్వరలో గత సినిమాలకు కొనసాగింపుగా ‘టెర్రినేటర్ జీనిసిస్' పేరుతో మరో సినిమా రాబోతోంది.

జులై 1న సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చిత్రంలోనూ 67 ఏళ్ల ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ హీరోగాగా నటిస్తున్నారు. ఇందులో ఆయన టెర్మినేటర్ ఒరిజినల్ టి-800 మోడల్ కనిపించబోతున్నారు. లీ బైంగ్ విలన్ పాత్రలో టి-1000 మెడల్ గా కనిపించబోతున్నారు. అలాన్ టేలర్ దర్శకత్వం వహిస్తున్నారు.

Terminator Genisys Movie - Official Trailer 2

‘టెర్రినేటర్ జీనిసిస్' సినిమాకు సంబంధించి ఇప్పటికే ఓ ట్రైలర్ విడుదల కాగా...తాజాగా సెకండ్ ట్రైలర్ విడుదల చేసారు. మొదటి ట్రలైర్ తో పాటు తాజాగా విడుదలైన సెకండ్ ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉండటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ట్రైలర్ చూస్తుంటే మరోసారి ఈ టెర్మినేటర్ ప్రపంచ సినీ అభిమానులను మెప్పించబోతున్నాడని స్పష్టమవుతోంది. 170 మిలియన్ డాలర్ల ఖర్చుతో ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రంలో ఇంకా ఎమిలి క్లార్క్, జాసన్ క్లార్క్, జాయ్ కోర్ట్నెనీ, మాట్ స్మిత్, లీ బైంగ్, డాయో ఒకెనియి, కోర్ట్నెనీ బి.వాన్స్, సాన్‌డ్రైన్ హోల్ట్, జెకె.సిమన్స్, డగ్లస్ స్మిత తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి డేవిడ్ ఎలిసన్, డనా గోల్డ్ బెర్గ్ నిర్మాతలు. పారామౌంట్ పిక్చర్స్ వారు ఈచిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X