మరో టెర్మినేటర్ సిరీస్, ట్రైలర్ అదిరింది (వీడియో)
హైదరాబాద్: ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గెర్ హీరోగా వచ్చే హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సిరస్ ‘టర్మినేటర్' సిరీస్ చిత్రాలకు ప్రపంచ వ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో కొత్తగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఈ సీరీస్ లో వచ్చిన టర్మినేటర్-2, టర్మినేటర్-3 చిత్రాలు భారీ విజయం సాధించాయి. త్వరలో గత సినిమాలకు కొనసాగింపుగా ‘టెర్రినేటర్ జీనిసిస్' పేరుతో మరో సినిమా రాబోతోంది.
ఈ చిత్రంలోనూ 67 ఏళ్ల ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ హీరోగాగా నటిస్తున్నారు. ఇందులో ఆయన టెర్మినేటర్ ఒరిజినల్ టి-800 మోడల్ కనిపించబోతున్నారు. లీ బైంగ్ విలన్ పాత్రలో టి-1000 మెడల్ గా కనిపించబోతున్నారు. అలాన్ టేలర్ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది జులై నెలలో ఈ చిత్రం విడుదల కానుంది.
టెర్మినేటర్ జెనిసీస్-అఫీసియల్ ట్రైలర్
తాజాగా ఈ చిత్రానికి సంబందించిన అపీషియల్ థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉండటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ట్రైలర్ చూస్తుంటే మరోసారి ఈ టెర్మినేటర్ ప్రపంచ సినీ అభిమానులను మెప్పించబోతున్నాడని స్పష్టమవుతోంది. 170 మిలియన్ డాలర్ల ఖర్చుతో ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రంలో ఇంకా ఎమిలి క్లార్క్, జాసన్ క్లార్క్, జాయ్ కోర్ట్నెనీ, మాట్ స్మిత్, లీ బైంగ్, డాయో ఒకెనియి, కోర్ట్నెనీ బి.వాన్స్, సాన్‌డ్రైన్ హోల్ట్, జెకె.సిమన్స్, డగ్లస్ స్మిత తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి డేవిడ్ ఎలిసన్, డనా గోల్డ్ బెర్గ్ నిర్మాతలు. పారామౌంట్ పిక్చర్స్ వారు ఈచిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











