ఆ హీరో భార్యతో అక్రమ సంబంధం.. పారిశ్రామికవేత్త క్లారిటీ.. యాక్టర్ వార్నింగ్

హాలీవుడ్‌ యాక్టర్లు జానీ డెప్, అంబర్ హర్డ్ మధ్య గొడవలు సరికొత్త మలుపులు తిరుగుతూ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే విడాకులు తీసుకొన్న ఈ స్టార్ యాక్టర్ల వివాదంలోకి అమెరికాకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. తన భార్యతో సంబంధం పెట్టుకొన్నందుకు అంగం కట్ చేస్తానని బెదిరిస్తూ చేసిన వ్యాఖ్యలను తేలికగా తీసుకొన్ని నవ్వుకున్నారు. అంబర్ హర్డ్‌తో రిలేషన్‌షిప్ గురించి ఎలాన్ మస్క్ స్పందిస్తూ..

జానీ డెప్, అంబర్ హర్డ్ కాపురంలో కలతలు

జానీ డెప్, అంబర్ హర్డ్ కాపురంలో కలతలు

హలీవుడ్ హీరో జానీ డెప్‌కు మోడల్, యాక్టర్ అంబర్ హర్డ్‌ 2011లో రమ్ డైరీ కామెడీ చిత్ర షూటింగ్‌లో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత 4 ఏళ్లు పీకల్లోతు ప్రేమలో మునిగిన తర్వాత 2015లో లాస్ ఎంజెలెస్‌లో వివాహం చేసుకొన్నారు. ఆ తర్వాత అభిప్రాయ, వ్యక్తిగత బేధాలు తలెత్తడంతో 2017లో వారిద్దరూ విడాకులు తీసుకొన్నారు. జానీ డెప్, అంబర్ హర్డ్ మధ్య విభేదాలు పరిష్కరించుకోలేనంతగా పెరిగిపోయాయి.

భార్యను దారుణంగా హింసించే వాడు..

భార్యను దారుణంగా హింసించే వాడు..

జానీ డెప్, అంబర్ హార్డ్ మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకొన్నాయి. జానీ, హార్డ్ మధ్య గొడవలపై స్పందిస్తూ భార్యను జానీ విపరీతంగా హింసించే వాడు అనే రితీలో ది సన్ పత్రిక కథనాన్ని వెల్లడించింది. తనపై వచ్చిన కథనంతో మనస్తాపం చెందిన జానీ డెప్.. ది సన్ ఎడిటర్ డాన్ వూటన్‌పై 2018లో పరువు నష్టం కేసు వేశారు. ది సన్ పత్రికపై పరువు నష్టం దావా కేసు లండన్ కోర్టులో విచారణ జరుగుతుండగా తన భార్యకు తనకు గొడవలకు కారణం టెస్లా సీఈవో, అమెరికాలో పారిశ్రామిక దిగ్గజం ఎలాన్ మస్క్‌పై జానీ డెప్ అనుచిత వ్యాఖ్యలు చేశారు.

నా అంగాన్ని కట్ చేస్తానని మెసేజ్

నా అంగాన్ని కట్ చేస్తానని మెసేజ్

తన కాపురాన్ని కూల్చిన ఎలాన్ మస్క్ అంగాన్ని కట్ చేస్తానని జానీ డెప్ పంపించిన మెసేజ్‌ను ఆయన తేలికగా స్పందించారు. జానీ డెప్ పంపిన మెసేజ్‌ను లేడీ గాగ మాజీ ప్రియుడు క్రిస్టియానోతో పంచుకొన్ని నవ్వుకున్నట్టు ఎలాన్ మస్క్ తెలిపారు. తనతో కలిసి ఉన్న సమయంలో అంబర్ హర్డ్‌తో అక్రమ సంబంధం పెట్టుకొన్నారు అని ఎలాన్ మాస్క్‌పై జానీ డెప్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.

అంబర్‌తో అక్రమ సంబంధం లేదు

అంబర్‌తో అక్రమ సంబంధం లేదు

తన భార్య అంబర్ హార్డ్‌కు ఎలాన్ మస్క్‌కు అఫైర్ ఉందని జానీ డెప్ చేసిన వ్యాఖ్యలపై ఎలాన్ మస్క్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. జానీ డెప్‌తో అంబర్ హార్డ్ విడాకులు తీసుకోకముందు గానీ, తర్వాత గానీ తనకు ఆమెకు మధ్య అఫైర్ లేదు అని ఎలాన్ మస్క్ స్పష్టం చేశారు. జానీ డెప్‌తో కాపురం చేస్తుండగానే అంబర్ హర్డ్‌తో సంబంధాలు పెట్టుకొన్నట్టు వస్తున్న వార్తలను ఖండించారు.

Recommended Video

Johnny Movie Completes 17 Years | Most Craziest Movie Ever
50 మిలియన్ల పరిహారం చెల్లించాలని పరువు నష్టం దావా

50 మిలియన్ల పరిహారం చెల్లించాలని పరువు నష్టం దావా

తన ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా కథనాన్ని ప్రచురించిన ది సన్ పత్రికపై జానీ డెప్ న్యాయపోరాటం చేస్తున్నారు. పరువు నష్టం కింద 50 మిలియన్ల పౌండ్లను పరిహారం చెల్లించాలని లండన్ కోర్టులో దావా వేశారు. ఈ ప్రస్తుతం ఈ అంశంపై కోర్టులో విచారణ జరుగుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X