థాయ్‌లాండ్ గుహ ఘటనపై సినిమా: రంగంలోకి హాలీవుడ్ నిర్మాతలు
Recommended Video

థాయ్‌లాండ్‌లోని తామ్ లువాంగ్ గుహలో 12 మంది చిన్నారులు, వారి సాకర్ కోచ్ చిక్కుకోవడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. రెండు వారాల పాటు శ్రమించి వారిని గుహ నుండి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
అయితే ఈ సంఘటన త్వరలో హాలీవుడ్ సినిమాగా రాబోతోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ గుహను పరిశీలించేందుకు ఇప్పటికే కొందరు హాలీవుడ్ నిర్మాతలు థాయ్ లాండ్ చేరుకోవడమే ఇందుకు నిదర్శనం.

ఎలా జరిగింది?
12 మంది చిన్నారులు, వారి సాకర్ కోచ్ థాయ్‌లాండ్‌లోని తామ్ లువాంగ్ గుహ ప్రవేశించిన తర్వాత భారీ వరదలు రావడంతో గుహలోకి నీరు చేరుకుని అందరూ అక్కడే చిక్కుకుపోయారు.

విదేశీ బృందాలు
వారిని కాపాడేందుకు సహాయక చర్యల్లో 13 మంది విదేశీ, ఐదుగురు థాయిలాండ్ గజ ఈతగాళ్లు పాల్గొన్నారు. చిమ్మచీకటిలో, బురదనీటిలో ప్రవాహవేగాన్ని తట్టుకుని బాలలను తీసుకురావడం కత్తి మీద సాములా ఈ వ్యవహారం నడిచింది.

ఒళ్లు గగుర్బొడిచే సాహసం
ఒకరకంగా చెప్పాలంటే ఈ వీరిని కాపాడేందుకు సహాయక బృందాలు ఒళ్లు గగుర్బొడిచే సాహసమే చేయాల్సి వచ్చింది. చిన్నారులను కాపాడే క్రమంలో ఓ నేవీ సీల్ కూడా మరణించిన విషయం తెలిసిందే.

వైద్యుల పర్యవేక్షలో
బయటపడిన బాలురు ఆరోగ్యంగానే ఉన్నారు. వారు ఇన్ని రోజులు చీకటిలో ఉండటంతో భయాందోళనతో గడిపారు. అయితే వారికి ఎలాంటి ఇన్‌స్పెక్షన్లు సోకకుండా వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.


Click it and Unblock the Notifications