»   »  డైరెక్టర్ నన్ను సెక్సువల్‌గా వేధించాడంటున్న ప్రముఖ నటి

డైరెక్టర్ నన్ను సెక్సువల్‌గా వేధించాడంటున్న ప్రముఖ నటి

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: మిషన్ ఇంపాజబుల్ 2, 2012 యుగాంతం, క్రాష్ లాంటి హాలీవుడ్ సూపర్ హిట్ చిత్రాలతో పాటు పలు బ్రిటిష్, అమెరికన్ చిత్రాల్లో నటించిన తాండీ న్యూటన్ కెరీర్ తొలినాళ్లలో తాను ఎదుర్కొన్ని కొన్ని ఇబ్బందికర పరిస్థితులను బయట పెట్టింది.

కెరీర్ తొలినాళ్లలో తాను ఆడిషన్స్ కు హాజరైన సమయంలో ఓ డైరెక్టర్ తనను సెక్సువల్ గా వేధించాడని తెలిపింది. ఆ డైరెక్టర్ తనతో ప్రవర్తించిన వీడియోను తీసి తన ఫ్రెండ్స్ చూపించాడని. అపుడు తాను యంగ్ ఏజ్ లో ఉన్నాను....ఎలాంటి బ్యాగ్రౌండ్, ఎవరి సపోర్టు కూడా లేదు. అందుకే సహించాల్సి వచ్చిందని తెలిపారు.

 Thandie Newton reveals she was sexually abused by director

ఇప్పటికీ కొందరు అలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారని ఆమె తెలిపారు. తాను అప్పుడు ఆలోచించినట్లు యువ కథానాయికలు ఆలోచించవద్దని, జీవితాన్ని అలాంటి పరిస్థితుల్లోకి నెట్టి వేసుకోవద్దని ఆమె సూచించారు.

43 ఏళ్ల న్యూటన్ ప్రస్తుతం ఇద్దరు ఆడ పిల్లలకు తల్లి. అయితే అప్పుడు తనను సెక్సువల్ గా వేధించిన డైరెక్టర్ పేరు బయట పెట్టడానికి మాత్రం న్యూటన్ నిరాకరించింది. ప్రస్తుతం న్యూటన్ అమెరికన్ ఎక్స్ ప్రెస్ మూవీలో నటిస్తోంది.

English summary
Thandie Newton has spoken out about an incident where a director sexually exploited her in a casting audition at the beginning of her career.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu