‘యాంగ్రీ బర్డ్స్’ సినిమా వస్తోంది (ట్రైలర్)
హైదరాబాద్: కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ గేమ్స్ ఆడే వారికి ‘యాంగ్రీ బర్డ్స్' గేమ్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంటా. ఇపుడు యాంగ్రీ బర్డ్స్ గేమ్ లోని బర్డ్స్ క్యారెక్టర్లతో ఓ హాలీవుడ్ సినిమా రాబోతోంది. పూర్తి యానిమేషన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఫెర్గాల్ రెయిలీ, క్లే కేటిస్ దర్శకత్వం వహిస్తున్నారు.
జాన్ కోహెన్, కేథరిన్ విండర్ నిర్మిస్తున్న ఈ చితాన్ని 2016 మే నెలలో ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 3డి టెక్నాలజీతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా పిల్లలతో పాటు పెద్దలనూ అలరిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు.

దాదాపు 80 మిలియన్ యూఎస్ డాలర్స్(రూ. 530 కోట్లు) ఖర్చుతో గ్రాండ్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా యాంగ్రీ బర్డ్స్ గేమ్ అందరికీ పరిచయమే, బాగా ప్రాచుర్యం పొందిన గేమ్. గేమ్ మాదిరిగానే సినిమా కూడా సూపర్ హిట్టవుతుందని ఆశిస్తున్నారు.


Click it and Unblock the Notifications











