అవార్డుల కార్యక్రమంలో 'ది ఆర్టిస్ట్' రికార్డుల మోత
65వ బ్రిటిష్ ఫిల్మ్ అకాడమీ అవార్డుల కార్కక్రమంలో ఉత్తమ చిత్రం కింద ప్రెంచి రొమాంటిక్ సినిమా 'ది ఆర్టిస్ట్' ఏడు అవార్డులను దక్కించుకుంది. ప్రతి సంవత్సరం ఉత్తమ చిత్రానికిచ్చే 'గోల్డ్ బాఫ్టా'ని కూడా ఇదే సినిమా సొంతం చేసుకోవడం విశేషం. ఈ సినిమా కధానాయకుడు దీన్ దిజార్దిన్ ఉత్తమ నటుడు అవార్డు దక్కగా.. హజనవిసిస్‌కు ఉత్తమ దర్శకుడు అవార్డులు దక్కాయి. బ్రిటిష్ ఆస్కార్‌గా పిలచుకునే ఈ అవార్డుల కార్యక్రమాన్ని లండన్ లో నిర్వహించారు. ఈ చిత్రానికి నిర్మాత ధామస్ లాంగ్‌మాన్, దర్శకుడు మికెల్ హాజనవసిస్.
ఇక ఈ సినిమా ప్రత్యేకతలను గమనిస్తే హాలీవుడ్ మూకీ చిత్రాలకు గుర్దుగా బ్లాక్ అండ్ వైట్‌లో ఆర్టిస్ట్ అనే సినిమాని రూపొందించినట్లు నిర్మాత తెలిపారు. ఇక 'ది ఐరన్ లేడీ'లో ఉత్తమ నటనకు గాను అమెరికా నటి మెరిల్ స్టీప్‌కు ఉత్తమ నటి అవార్డు లభించింది. ది ఐరన్ లేడీ సినిమాలో మెరిల్ బ్రిటన్ మాజీ ప్రధాని మార్గరెట్ థాచర్ పాత్రని పోషించారు.
దహెల్స్ అనే చిత్రంలో నటించిన ఆక్టేవియా స్పెన్సర్‌కు ఉత్తమ సహాయ నటి, బిగినర్స్ సినిమాలో నటించిన నటనకు గాను క్రిస్టఫర్ ఫ్లమర్‌కు ఉత్తమ సహాయ నటుడు అవార్డులు దక్కాయి. ఇదే అవార్డుల కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్‌కు అవార్డును అందజేశారు.


Click it and Unblock the Notifications











