twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ సెలబ్రిటీ జంటల జీవితాల్లో చీకటి నింపిన క్రిస్ట్ మస్..!!

    By Kuladeep
    |

    హాలీవుడ్ లో ప్రతీ ఏడాది ఎక్కువ హంగామా వుండే సమయం ఏదంటే క్రిస్ట్ మస్ మరియు న్యూ ఇయర్ సీజన్ అని టక్కున చెప్పవచ్చు. కాగా ఈ ఏడాది క్రిస్ట్ మస్ ఎంతో మంది హాలీవుడ్ సెలబ్రిటీలకు వెలుగును పంచివ్వలేకపోతోంది. ఈ స్టార్ జంటల మధ్య వచ్చిన గొడవల కారణంగా జంటలో ఒకొక్కరు విడివిడిగా ఈ సంబరాలను జరుపుకోవాల్సి వస్తోంది. వీరిలో ముఖ్యులు క్యాటీ ప్రైజ్ మరియు పీటర్ ఆండ్రీ, మేఘన్ ఫాక్స్ మరియు బ్రియాన్ ఆస్టిన్ గ్రీన్, టైగర్ వుడ్స్ మరియు ఎలిన్ నోర్డెగ్రెన్ జంటలు.

    తొలుత ఇంగ్లాండ్ మోడల్ క్యాటీ ప్రైజ్, ఆమె మాజీ భర్త, ఆస్ట్రేలియా గాయకుడు పీటర్ ఆండ్రీలు ఈ ఏడాది విడాకులతో విడిపోయారు. ఆ తర్వాచ క్యాటీ తిరిగి అతనికి దగ్గర కావాలని ప్రయత్నించినప్పటికీ అది బెడిసికొట్టడంతో ఒంటరి అయిపోయింది. ఆ తర్వాత వారిద్దరి పిల్లలకోసం కలసి క్రిస్ట్ మస్ సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నప్పటికీ పీటర్ వారిని ఆస్ట్రేలియాలోని తన తల్లిదండ్రుల వద్దకు తీసుకెళ్లాలనుకున్నాడు. దీనికి క్యాటీ ససేమీరా అనడంతో అతను ఒంటరిగానే ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు.

    మరో జంట మేఘన్ ఫాక్స్ మరియు బ్రియాన్ స విషయానికి వస్తే.. వీరిద్దరూ క్రిస్ట్ మస్ ను వారి వారి తల్లిదండ్రులు, స్నేహితులతో కలసి జరుపుకోవాలనుకున్నారు. ఇద్దరూ వారి తల్లిదండ్రుల వద్ద ఉండాలనుకోవడంతో ఈ జంట ఒంటరిగానే క్రిస్ట్ మస్ వేడుకలను జరుపుకోనుంది.

    మరో జంట టైగర్ వుడ్స్, ఎలిన్ ల విషయానికి వస్తే, టైగర్ వుడ్స్ రహస్యంగా 14 మంది యువతులతో సాగిస్తున్న మన్మథలీలలు బయటపడటంతో వారిద్దరూ ప్రస్తుతం విడాకుల కోసం కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. తన భార్య, పిల్లల కోసం తాను మారిపోయానని అవసరమయితే తనకు ఎంతో ప్రాణమయిన గోల్ఫ్ ఆటను వదిలేస్తానని అతను ఎంత బ్రతిమలాడినా ఎలిన్ కరుగలేదు. దీంతో ఈ జంటకు ఈ క్రిస్ట్ మస్ ఓ చేదు జ్ఞాపకంగానే మిగిలిపోనుంది..

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X