హాలీవుడ్ కంటే ముందుగా టాలీవుడ్ లోవిడుదలకు సిద్దమైన సినిమా...
నార్నియా పేరుతో వచ్చినటువంటి చిత్రాలు టాలీవుడ్ లోమంచి బాక్సాఫీసు రికార్డుల్ని నమోదు చేశాయి. అంతేకాకుండా హాలీవుడ్ లోవిడుదలైన రోజునే ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ధియేటర్స్ లోప్రదర్శింపబడుతున్నాయి ఆంగ్ల చిత్రాలు. అంతేకాకుండా నార్నియా చిత్రానికి సీక్వెల్ గావస్తున్నటువంటి ది క్రానికల్ ఆఫ్ నార్నియా అనే సినిమా హాలీవుడ్ లోకంటే ఓ వారం ముందుగా మన తెలుగులో ప్రదర్శింపబడడానికి సిద్దంగా ఉంది.
ది క్రానికల్ ఆఫ్ నార్నియా-ది వాయేజ్ ఆఫ్ ది డాస్ ట్రేడర్ అనే చిత్రాన్ని మైఖెల్ అప్టెడ్ రూపోందించారు. ఇక ఈసినిమాలో ఇంతకు ముందు వచ్చినటువంటి రెండు భాగాలకు భిన్నంగా మంచి ఎపెక్టులను ఉపయోగింటి తీశారని అన్నారు. జనరల్ గానార్నియా సినిమాలలో జంతువులు మాట్లాడడం, మనుషులకు సాద్యం కాని సాహాసాలు చేసి చూపడం లాంటి అధ్బుతమైన విన్యాసాలు చేయడం జరుగుతుందని అన్నారు.
ఇక ఈమూడవ భాగంలో విజువల్ ఎఫెక్ట్సు తోకధను మరింత బాగా తీశారని అన్నారు. ప్రస్తుతం ఈసినిమాని 3డిలో రూపోందించడం జరిగిందని అన్నారు. ఈసినిమాని రూపోందించినటువంటి ట్వంటీయత్ ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంస్ద హాలీవుడ్ లోకాకుండా మొట్టమొదట మనదేశంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సంస్ద ప్రతినిధి మాట్లాడుతూ ఆంగ్లంతోపాటు హిందీ, తెలుగు భాషల్లో దేశమంతటా ప్రేక్షకులకు కనువిందు చేయడానికి వస్తుందని ఈమూడవ నార్నియా అని అన్నారు. గతంలో వచ్చినటువంటి నార్నియా సినిమాలు మంచి బాక్సాఫీసు రికార్డుల్ని నమోదు చేయడంతో తెలుగులో విడుదల చేయాలని నిర్ణయించుకున్నామని అన్నారు.


Click it and Unblock the Notifications











