ప్రముఖ నటుడు ఆత్మహత్య.. శోక సంద్రంలో సినీ పరిశ్రమ!
ప్రముఖ హాలీవుడ్ నటుడు నికీ క్యాట్ ఇకలేరు. ఆయన నట, వ్యక్తిగత జీవితం విషాదకరంగా ముగిసింది. ఆయన ఆత్మహత్య చేసుకొని సినీ వర్గాలను అత్యంత బాధాకరమైన పరిస్థితుల్లోకి నెట్టి తిరిగి రాని లోకాలకు వెళ్లారు. నికీ క్యాట్ మరణ వార్త వినగానే సినీ దర్శకులు, నటులు, అభిమానులు, శ్రేయోభిలాషులు, సన్నిహితులు దిగ్బ్రాంతికి గురయ్యారు. ఆయన మరణం నేపథ్యంలో తనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొంటూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతికి, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
డేజ్డ్, కన్‌ఫ్యూజ్‌డ్, బోస్టన్ పబ్లిక్, ఏ టైమ్ టూ కిల్ సినిమాలతో అత్యంత పాపులారిటీ సంపాదించుకొన్న నటుడు నికి క్యాట్. ఆయన వయసు 54 సంవత్సరాలు. గత 40 ఏళ్లుగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్నారు. దాదాపు 75 చిత్రాల్లో నటించడమే కాకుండా విశేషమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొన్నారు. ఆయన మరణాన్ని ఆత్మహత్యగా లాస్ ఎంజెలెస్ కౌంటీ మెడికల్ ఎగ్జామినర్ డిపార్ట్‌మెంట్ ధృవీకరించింది.

నికి క్యాట్ లాస్ ఎంజెలెస్‌లోని తన నివాసంలో శనివారం ఏప్రిల్ 12వ తేదీన ఆత్మహత్య చేసుకొన్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమాచారం మేరకు మేము ఆయన పార్దీవదేహానికి పరీక్షలు నిర్వహించాం. ఆయన మృతికి కారణం సూసైడ్ అని అధికార వర్గాలు ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. అయితే ఆయన మరణానికి కారణాలు మాత్రం తెలియరాలేదు. ఆయన మరణ వార్తతో సినీ వర్గాలు శోక సంద్రంలో మునిగిపోయారు.
క్యాట్ తన 40 ఏళ్ల సుదీర్ఘ నట ప్రయాణంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు, విభిన్నమైన చిత్రాల్లో నటించారు. ఆయన సిస్టర్ యాక్ట్, స్కూల్ ఆఫ్ రాక్, క్రిస్టఫర్ నోలన్ రూపొందించిన ది డార్క్ నైట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. 1980 సంవత్సరంలో నట జీవితాన్ని ఆరంభించిన ఆయన 2019 వరకు తన యాక్టింగ్ కెరీర్‌లో కొనసాగారు. ప్రముఖ దర్శకుడు రాబర్ట్ రొడ్రిగ్జ్స్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది.
క్యాట్ మృతితో రాబర్డ్ రొడ్రిగ్జ్స్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయనకు ఏ సినిమాలోనైనా అవకాశం ఇస్తే.. ఆయన తన పాత్రకు తగినట్టుగా ప్రిపేర్ అవ్వడమే కాకుండా ఆ రోల్ తగినట్టుగా దుస్తులు, సంబంధించిన ప్రాపర్టీస్‌తో వచ్చే వారిలో ఏకైక వ్యక్తి. ఆయనలో సృజనాత్మకత, కొత్త విషయాలను వెల్లడించడం ప్రత్యేకత. అందుకే ఆయన గొప్ప పాత్రలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించారు. అలాంటి గొప్ప వ్యక్తిని కోల్పోవడం చాలా విషాదంగా ఉంది. నాకు తీరని లోటు అని అన్నారు.


Click it and Unblock the Notifications











