twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గడాఫీ జీవితం పై కామెడీ సినిమా

    By Srikanya
    |

    లిబియా నియంత ముమ్మార్ గడాఫీ జీవితం ఆధారంగా హాలీవుడ్ ది డిక్టేటర్ అనే చిత్రం రూపొందించింది. ఎట్టి పరిస్దితుల్లోనూ ప్రజాస్వామ్యం తన దేశంలో రాకుండా ఆపటానికి తన జీవితాన్ని పణంగ పెట్టిన ఓ వ్యక్తి కథగా ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నారు. బరాన్ కోహెన్ రాసి,నటించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఇది ఓ కామెడీ చిత్రం. గఢాఫీ జీవిత చరిత్ర అని దర్సక,నిర్మాతలు చెప్పకపోయినా ఈ సినిమా గఢాఫీ మీద తీసిన ఓ సెటైర్ అంటున్నారు.

    ముమ్మార్ గడాఫీ విషయానికి వస్తే... ఆయన లిబియా ప్రజలకు ఒకప్పుడు హీరో. ఇప్పుడు అదే ప్రజల చేతులో దారుణంగా చంపబడ్డాడు. అధికారంలోకి వచ్చిన ప్రారంభంలో హీరోగా చూసిన ప్రజలే అతను చనిపోతే సంబరాలు చేసుకున్నారు. నాలుగు దశాబ్దాల క్రితం 1969 సెప్టెంబర్ ఒకటో తేదీన లిబియాలోని రాచరికాన్ని కూలదోసి గడాఫీ గద్దెనెక్కారు. బ్రిటన్‌లో సైనిక శిక్షణ పూర్తి చేసుకొని వచ్చి రాచరిక వ్యవస్థపై తిరుగుబాటు చేశాడు. గడాఫీ అప్పుడు ఎలాంటి రక్తపాతం లేకుండా లిబియాను తన హస్తగతం చేసుకున్నాడు. నాటి నుండి నేటి వరకు అక్కడ తన ఆధిపత్యాన్ని కొనసాగించాడు.

    అయితే రక్తపాతం లేకుండా హస్తగతం చేసుకున్న లిబియాను ఆ తర్వాత రక్తపుటేరులలో ముంచాడు. గడాఫీకి ఇద్దరు భార్యలు, ఏడుగురు కొడుకులు, ఒక కూతురు. ప్రతి విషయంలోనూ గడాఫీ వెరైటీగా ఉండేవాడు. వస్త్రధారణ నెమలి పింఛం మాదిరి ఉంటుంది. తన అంగ రక్షకులుగా మహిళలను ఎంచుకుంటాడు. ఆయన సొంత పట్టణం సిర్తేలో కుటుంబ సభ్యులు ఉంటారు. అధికారం చేతిలోకొచ్చాక జల్సాలు చేయటం ప్రారంభించాడు. ప్రపంచంలోనే మొదటి పది భారీ చమురు దేశాలలో లిబియా ఉంటుంది. చమురు బావులనన్నింటినీ తన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల చేతిలోనే ఉంచేవాడు. దాని ద్వారా వచ్చే ఆదాయంతో విలాసాలు చేసేవాడు.

    తనకు అనుగుణంగా కొత్త కొత్త విధానాలు తీసుకు వచ్చేవాడు. రాజకీయ పార్టీలు పెట్టడాన్ని నిషేధించాడు. అలాంటి ప్రయత్నాలు చేసిన వారిని కఠినంగా శిక్షించేవాడు. అంతా అతను చెప్పినట్లు వినాల్సిందే. ఎవరైనా ఎదురు తిరిగితే వారిని కఠినంగా అణిచి వేసే వాడు. ఒక విధంగా లిబియాకు గడాఫీయే ఆధ్యాత్మిక గురువు, దిశా నిర్దేశకుడు. తాను చేస్తున్నది ప్రజాస్వామ్యమని నమ్మేవాడు. అదే అతని నియంతృత్వానికి దారి తీసింది. గడాఫీ రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్న 1969లోనే అతనికి వ్యతిరేకంగా వచ్చిన తిరుగుబాటును అణిచి వేశాడు.

    అధికారం హస్తగతమైన తర్వాత అమెరికా, బ్రిటిషన్ సైనిక స్థావలాన్ని మూసేయించి వారి ఆగ్రహానికి గురయ్యాడు. మరిన్ని రాబడులు లిబియాకు పంచితే తప్ప మీకంపెనీల్ని చమురు క్షేత్రాల నుంచి తరిమేస్తానని హెచ్చరించడంతో ఆ దేశాలు మరింత ఎక్కువ వాటా ఇవ్వడానికి ఒప్పుకున్నాయి. 2004 నుండి గడాఫీ అరాచకం మరీ ఎక్కువైంది. ఇటీవల తనకు వయసు మీద పడుతుంటడంతో తన కొడుకును పీఠంపై కూర్చుండ బెట్టాలని చూశాడు. అదే సమయంలో అరబ్బు దేశాలలో చెలరేగిన ఉద్యమాలు గడాఫీని వణికించాయి. ఉద్యమం పేరుతో లిబియాలు బయటకు వచ్చిన వారిపై కత్తి గట్టాడు. పౌరులను మూకుమ్మడిగా కాల్చి వేయించాడు. ఆ తర్వాత తిరుగుబాటుదారులు, నాటో దళాల కాల్పులు అధికమవడంతో అజ్ఞాతంలోకి వెళ్లి గురువారం తప్పించుకోపోతూ హతమయ్యాడు.

    English summary
    The Dictator is an upcoming 2012 comedy film co-written by and starring Sacha Baron Cohen. His fourth feature film in a leading role "tells the story of a dictator who risked his life to ensure that democracy would never come to the country he so lovingly oppressed". Some Hollywood people says that ..
 The Dictator is a film on Gaddaffi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X