The Exorcist ప్రముఖ దర్శకుడు కన్నుమూత.. ఐదు ఆస్కార్ అవార్డులతో చరిత్ర!

హాలీవుడ్‌లో ప్రముఖ దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత, ఎక్సార్సిస్ట్ ఫేమ్ విలియమ్ ఫ్రైడ్‌కిన్ ఇకలేరు. గత కొద్దికాలంగా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న ఆయన లాస్ ఎంజెలెస్‌లో అక్కడ కాలమానం ప్రకారం సోమవారం ఉదయం కన్నుమూశారు. ఆయన మరణ వార్తను భార్య కూడా ధృవీకరించడంతో సినీ అభిమానులు, సన్నిహితులు, స్నేహితులు విషాదంలో మునిగిపోయారు. విలియమ్ ఫ్రైడ్‌కిన్ వ్యక్తిగత, ప్రొఫెషనల్ విషయాల్లోకి వెళితే..

విలియమ్ ఫ్రైడ్‌కిన్ వ్యక్తిగత వివరాల్లోకి వెళితే.. ఆగస్టు 29వ తేదీ, 1935 సంవత్సరంలో షికాగోలో జన్మించారు. ఆయన నాలుగు వివాహాలు జరిగాయి. తొలుత ఫ్రెంచ్ నటి జీనే మారియూను 1977 వివాహం చేసుకొన్నారు. ఆ తర్వాత లెస్లీ యాన్ డౌన్‌ను రెండో వివాహం చేసుకొన్నారు. కెళ్లీ లాంజే‌ను వివాహం చేసుకొని వ్యక్తిగత అభిప్రాయ బేధాల కారణంగా విడాకులు ఇచ్చారు. నాలుగో భార్యతో షెర్రీ లాన్సింగ్‌తో దాంపత్య జీవితాన్ని కొనసాగించారు. ఆయన ఇద్దరు సంతానం.

The Exorcist fame William Friedkin passed away at age of 87

విలియమ్ ఫ్రైడ్‌కిన్ సినీ జీవితం విషయానికి వస్తే.. 1967 సంవత్సరంలో గుడ్ టైమ్స్ చిత్రం ద్వారా దర్శకుడిగా సినీ రంగ ప్రవేశం చేశారు. 1973 సంవత్సరంలో ఎక్సారిస్డిస్ట్ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆయన తీసిన చిత్రాల్లో ది ఫ్రెంచ్ కనెక్షన్, రాంపేజ్, ది గార్డియన్, బ్లూ చిప్స్, ది హంటెడ్ చిత్రాలు ప్రేక్షకాదరణ పొందాయి. సినిమాలే కాకుండా డాక్యుమెంటరీలు, టెలివిజన్ షోలు, టెలివిజన్ సినిమాలు రూపొందించిన ఘనత ఆయన పేరిట ఉంది.

హాలీవుడ్‌లో దర్శకుడిగా, నిర్మాతగా, స్క్రీన్ రైటర్‌గా గుర్తింపు పొందిన విలియమ్ ఫ్రైడ్‌కిన్‌కు ఆస్కార్ అవార్డు లభించింది. 1971లో ఆయన రూపొందించిన ది ఫ్రెంచ్ కనెక్షన్స్ సినిమాకు ఐదు అవార్డులు లభించాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ స్క్రీన్ ప్లే, బెస్ట్ డైరెక్టర్ అవార్డులు అందుకొన్నారు. ఎక్సారిసిస్ట్ సినిమాకు ఉత్తమ డైరెక్టర్‌గా నామినేట్ అయ్యారు.

హాలీవుడ్‌లో విలియమ్ ఫ్రైడ్‌కిన్ సరికొత్త ఒరవడి సృష్టించిన దర్శకుడిగా పేరుంది. ప్రేక్షకులను భయభ్రాంతులకు గురి చేసే విధంగా సన్నివేశాలను రూపొందించడంలో దిట్ట. స్టీవెన్ స్పీల్‌బర్గ్‌ను స్పూర్తి పొంది సినిమాలను రూపొందించారు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X