హాలీవుడ్ ప్రపంచంలో మొదలైన AI మంట.. భవిష్యత్తు కోసం రైటర్స్ లో ఆసక్తికరమైన చర్చ!
ప్రపంచ సాహిత్య రంగాన్ని, రైటర్లను గజగజ వణిస్తున్న పేరు AI (Artificial Intelligence). ఏఐ సాంకేతిక వల్ల తమ ఉద్యోగాలు పోతాయేమోనని చాలా మంది భయపడుతున్నారు. యాంత్రిక మేధస్సు వస్తే ఐటీ నిపుణులు ఉద్యోగాలు పోతాయనుకునేవారు. కానీ ఇప్పుడు ఆ భయం సృజనాత్మక రంగ కళాకారులను కూడా భయపెడుతోంది.
ఒకప్పుడు సైన్స్ ఫిక్షన్ స్క్రిప్ట్ లు రాసి, ప్రపంచాన్ని యంత్రాలు శాసిస్తాయని ముందే ఊహించి కథలను సిద్ధం చేసిన రచయితలు కూడా ఇప్పుడు ఏఐ అంటే భయపడిపోతున్నారు. కృత్రిమ మేధ రాకతో తమ ఉపాధికి గండిపడుతుందని ఆందోళన చెందుతున్నారు. సినిమాలు, వెబ్ సిరీసులు, టీవీ స్క్రిప్ట్ లను రాయడంలో కృత్రి మేధస్సు వినియోగాన్ని పరిమితం చేయాలని రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా తాజాగా కోరడం చర్చనీయాంశంగా మారింది.

ఏఐ వల్ల తమ ఉద్యోగాలు పోయి, ఉపాధి కరవయ్యే ప్రమాదం ఉందని భావించి హాలీవుడ్ రైటర్లు ఈ ప్రతిపాదనను తీసుకువచ్చారు. హాలీవుడ్ చలనచిత్ర, టీవీ రచయితలు సోమవారం సమ్మెకు దారితీసిన అనేక ఇతర సమస్యల్లో AIపై వివాదం ఒకటి. గత 15 సంవత్సరాల్లో రచయితలు ఇలా పనులు ఆపి సమ్మె చేయడం ఇదే తొలిసారి. అయితే కృత్రిమ మేధస్సుతో ఇప్పటికిప్పుడు వచ్చే నష్టం లేకపోయినప్పటికీ సమీప భవిష్యత్తులో మాత్రం ఏఐ గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఇప్పటికే రెడీ అయిన స్క్రిప్ట్ లను ఏఐ ని శిక్షణ ఇవ్వడానికి ఉపయోగించడాన్ని కూడా రచయితలు ఒప్పుకోవడం లేదు. ఫస్ట్ డ్రాఫ్ట్ లను ఏఐకి ఇచ్చి ఫైనల్ కాపీని రెడీ చేయడాన్ని కూడా హాలీవుడ్ రైటర్స్ వ్యతిరేకిస్తున్నారు. ఓపెన్ ఏఐ సంస్థ తీసుకువచ్చిన డాల్-ఇ ప్లాట్ ఫామ్ రూపొందిస్తున్న అద్భుతమైన కళాఖండాలు సోషల్ మీడియాలో అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నాం.

డాల్-ఇ మాదిరిగానే మిడ్ జర్నీ, స్టేబుల్ డిఫ్యూజన్ లాంటి ఏఐ ప్లాట్‌ఫామ్‌లు సృష్టిస్తున్న చిత్రాలు సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ అవుతున్నాయి. మహాత్మాగాంధీ చిన్నారులతో సెల్ఫీ తీసుకోవడం, డొనాల్డ్ ట్రంప్ ముంబయి స్లమ్ లో కనిపించడం, రొనాల్డో రెస్టారెంట్లో పని చేయడం లాంటి ఏఐ సృష్టించిన చిత్రాలు సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి.


Click it and Unblock the Notifications











