తొలిసారి హాలీవుడ్‌లో బాలీవుడ్ సూపర్ స్టార్ 'బిగ్ బి'
బాజ్ లూహుర్మాన్ దర్శకత్వంలో త్వరలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్దమైన 3డి సినిమా 'ది గ్రేట్ గాట్స్‌బై'. ఐతే ఈ సినిమాకున్న ప్రాముఖ్యత ఏమిటని అంటారా..? ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ సూపర్ స్టార్ 'బిగ్ బి అమితాబ్' హాలీవుడ్‌కి పరియమవుతున్నారు. ఈ ప్రక్కనున్న చిత్రంలో 'ది గ్రేట్ గాట్స్‌బై' ఓ సన్నివేశంలో బిగ్‌బి అమితాబ్, నటులు లియోనార్డో డికాప్రియో, తోబే మాగ్యూర్‌తో కలిసి కూర్చోన్నారు.
ఆ సినిమాలో అమితాబ్ యూదు డబ్బు ఇచ్చేవాడిగా(మనీ లెండర్) పాత్రను పోషించారు. ఈ పాత్ర పేరు మేయర్ వోల్ఫిషిమ్. ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్‌లో అమితాబ్ రెండు సార్లు కనిపించనున్నారు. ఈ ట్రైలర్ ద్వారా 1920లలో అమెరికా ఎలాగ ఉండేదో అలాంటి వాతావరణాన్ని చూపించారని ట్రైలర్ చూసిన వారంతా అనుకుంటున్నారు.
హీరో, హీరోయిన్ పాత్రలైన జే గాట్స్‌బై, డైసీ బుచనన్ పాత్రలలో లియోనార్డో డికాప్రియో, క్యారీ ముల్లిగన్ నటిస్తున్నారు. ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 25న విడుదల చేసేందుకు రంగం సిద్దం చేశారు.
ఈ సినిమాలో అమితాబ్‌తో పాటు టైటానిక్ సూపర్ హీరో లియోనార్డో డికాప్రియో మరియు సూపర్ మ్యాన్ సిరిస్‌ల ద్వారా ప్రపంచం మొత్తం అభిమానులను సంపాదించుకున్న తోబే మాగ్యూర్ నటిస్తున్నారు. ఈ సినిమాని స్కాట్ ఫిట్జ్ర్అల్డ్ రచించిన 'ది గ్రేట్ గాట్స్‌బై' నవల ఆధారంగా తెరకెక్కించారు. దర్శకత్వం: బాజ్ లూహుర్మాన్, స్క్రీన్ ప్లే: బాజ్ లూహుర్మాన్, గ్రేగ్ పీయర్స్.


Click it and Unblock the Notifications











