జూన్ 17న ‘అవతార్’ ను మైమరపించే 'గ్రీన్ లాంటర్న్'...
సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, వండర్ ఉమెన్, ఆక్వామెన్ వంటి సూపర్ హీరోస్ కామిక్ బుక్స్‌ను అందించిన వార్నర్‌బ్రదర్స్‌కు చెందిన డిసి కామిక్స్ నుండి వెలువడినదే 'గ్రీన్‌లాంతర్". గత కొన్ని దశాబ్దాలుగా విశేష ఆదరణ పొందిన ఈ కామిక్ స్టోరీ ఆధారంగా ఇప్పుడు 'గ్రీన్‌లాంతర్" చిత్రం తెరకెక్కింది. మార్టిన్ కేంప్‌బెల్ దర్శకత్వంలో డొనాల్డ్ డె లైన్, జర్జ్‌బెర్లాంటి ఈ చిత్రాన్ని నిర్మించారు. రయాన్ రెనాల్డ్స్, బ్లాక్ లైవ్లీ, పీటర్ సర్గార్డ్, మార్క్‌స్ట్రాంగ్, ఏంజిలా బస్సెట్, టిమ్ రాబిన్స్ ఇందులో కీలక పాత్రలను పోషించారు. ప్రముఖ పంపిణీ సంస్థ వార్నర్ బ్రదర్స్ ద్వారా ఈ సినిమా జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.
ఈ చిత్రాన్ని తెలుగులో 'అవతార్ 2011" పేరుతో మల్టీ డైమన్షన్ ఎంటర్‌టైన్ మెంట్స్ ప్రై.లి. సంస్థ అందిస్తోంది. 114 నిమిషాల నిడివి ఉండే ఈ సూపర్‌హీరో బెస్ట్ ఫిల్మ్‌ను 150 మిలియన్ డాలర్ల భారీ వ్యయంతో నిర్మించారు. ఇందులో హాల్ జోర్డాన్ గా గయాన్ రెనాల్డ్, అతని ప్రియురాలు కరోల్ ఫెర్రిస్ గా బ్లాక్ లైవ్లీ, హాల్ జోర్డాన్ మానిటర్ గా మార్క్ స్ట్రాంగ్ నటించారు. అద్భుతమైన గ్రాఫిక్ వర్క్స్, స్పెషల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాను ఉన్నత స్థాయిలో నిలిపాయి. ఆంధ్రప్రదేశ్ అంతటా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలలో ఈ నెల 17న విడుదలవుతున్న 'అవతార్ 2011" విజయంపై నమ్మకాన్ని వ్యక్తంచేశారు.


Click it and Unblock the Notifications











