»   » ‘హంగర్స్ గేమ్’ సీక్వెల్‌ ఈ వారంలోనే

‘హంగర్స్ గేమ్’ సీక్వెల్‌ ఈ వారంలోనే

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్ : హాలీవుడ్ లోనూ సీక్వెల్స్ యుగం నడుస్తోంది. ఆ మధ్య వచ్చిన హాలీవుడ్ చిత్రం 'హంగర్స్ గేమ్' ఏ రేంజిలో విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రం సీక్వెల్‌ గా 'ద హంగర్స్ గేమ్ క్యాచింగ్ ఫైర్'టైటిల్ తో అభిమానులను అలరించటానికి వస్తోంది. . సంచలనం సృష్టించిన ఓ నవల ఆధారంగా గతంలో హంగర్స్‌గేమ్‌గా రూపొంది ఘనవిజయం సాధించిన చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న చిత్రమే 'ద హంగర్స్ గేమ్ క్యాచింగ్ ఫైర్'.

మనుషుల ప్రాణాలతో చెలగాటమాడే పాలకుల అహంకారాన్ని ఎదిరిస్తూ ఓ మహిళ చేసే పోరాటమే ఈ చిత్రం. మనుషుల ప్రాణాలతో ఆడుకునే ప్రక్రియ కలిగిన ఓ రాజ్యంలో నిత్యం జరిగేదే డెత్‌గేమ్. ఈ అంశంతో రూపొందిన చిత్రమిది. ఒక్కొక్క దేశం నుంచి ఇద్దరిని లాటరీ ద్వారా ఎన్నుకుని అందరినీ కలిపి ఒకరినొకరిని చంపుకుచావమని చెబుతారు. గెలిచినవాళ్ళే వాళ్ళ దేశానికి ప్రాణాలతో తిరిగివెళతారు. ఇది ఈ పాలకులు ఆడే డెత్‌గేమ్. కేవలం వినోదం కోసమే ఇలాంటి గేమ్స్ రాజ్యపాలకులు నిర్వహిస్తూ వుంటారు.

Hunger Games

అలా లాటరీలో వచ్చిన హీరోయిన్ ఈ డెత్‌గేమ్‌లో పాల్గొంటుంది. ఆ పోరాటంలో పాల్గొన్న ఆమెకు అక్కడే హీరో పరిచయమవుతాడు. చివరకు ఆ డెత్‌గేమ్‌లో హీరో హీరోయిన్‌లు ఇద్దరే మిగులుతారు. మనుషుల ప్రాణాలతో ఆడుకునే ఇలాంటి గేమ్స్ జరగటానికి వీల్లేదంటూ పాలకులను ఎదిరిస్తుంది హీరోయిన్. డిఫరెంట్ కానె్సప్ట్‌తో ఎంతో ఆసక్తిగా క్షణక్షణం ఉత్కంఠతతో అనేక టెక్నికల్ వాల్యూస్‌తో కళ్ళు చెదిరే విజువల్ వండర్‌గా ఈ చిత్రం రూపొందించబడింది.

జెన్నీఫర్ లారెన్స్, జోష్ హెడ్చెర్‌సన్ లిమ్ హేమ్స్‌వర్త్ సామ్యూల్ హూస్‌మెన్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి దర్శకుడు ఫ్రాన్సీస్ లారెన్స్. ఈ చిత్రాన్ని యూనివర్సల్ పిక్చర్స్ ద్వారా తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషలలో ప్రపంచ దేశాలతోపాటు డిసెంబర్ 6న ఆంధ్రప్రదేశ్‌లో విడుదల కానున్నది.

English summary
Catching Fire, the sequel to Jennifer Lawrence starrer The Hunger Games, will release in India on December 6th.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu