twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    BAFTA అవార్డుల్లో కనిపించని 'అవతార్' సందడి..!!

    By Kuladeep
    |

    బ్రిటీష్ లో అత్యున్నత పురస్కారంగా భావించే BAFTA (British Academy of Film and Television Arts) అవార్డుల్లో జేమ్స్ కామెరూన్ సృష్టించిన అద్భుత సాంకేతిక మాయాజాలం, ప్రపంచంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం అవతార్ వెలవెలబోయింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్ ప్లే ఈ మూడు విభాగాల్లో ఏ విభాగంలో కూడా ఈ సినిమా అవార్డు సాధించలేకపోయింది. ఈ మూడు విభాగాలనీ కామెరూన్ చిత్రానికి ప్రతి అవార్డుల్లో గట్టి పోటీని ఇస్తున్న క్యాథరీన్ బిగిలోవ్ దర్శకత్వం వహించిన ది హర్ట్ లాకర్ సినిమా కైవసం చేసుకుంది.

    అవతార్ సినిమా కేవలం రెండే విభాగాల్లో అవార్డును సాధించి ఉనికిని చాటుకోవడానికి చాలా కష్టపడింది. ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్, ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ లో మాత్రమే ఈ సినిమా అవార్డును సాధించగలిగింది. మరి రాబోవు ఆస్కార్ లో కూడా ఇవే ఫలితాలు పునరావృతం అవుతాయా అని పరిశీలకులు ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X