ఒక్క రోజులో సినిమాని... 750,000 మంది డౌన్ లోడ్
న్యూ యార్క్: సినిమాలను ఇల్లిగల్ గా డౌన్ లోడ్ చేయటం నిత్యకృత్యమైపోయింది. ఈ సమస్య కేవలం టాలీవుడ్ కే కాక హాలీవుడ్ కీ ఉంది. తాజాగా క్రిస్మమస్ సందర్బంగా ... 2014 లో వచ్చిన "The Interview" చిత్రాన్ని 750,000 మంది టోరెంట్ ల ద్వారా డౌన్ లోడ్ చేసుకున్నారు. టోరెంట్ ఫ్రీక్ సైట్ ఈ విషయాన్ని ఖరారు చేసింది. ఫైల్ షేరింగ్ సాప్ట్ వేర్ ద్వారా డిజిటల్ కాపీలను దొంగతనం చేసినట్లు కంప్లైంట్ లు నమోదు చేసారని చెప్తున్నారు.
ఈ చిత్రం కథ..."షైలార్క్ టు నైట్" అనే టాబ్లయిడ్ షో అనే పోగ్రామ్ చుట్టూ తిరుగుతుంది. దాన్ని డేవ్ షై లార్క్ అనే డైరక్టర్, ఆరాన్ రాపోట్ అనే నిర్మాత కలిసి రన్ చేస్తూంటారు. ఆ ఇంటర్వూలలో భాగంగా...ఓ సర్ఫైజ్ ఫ్యాన్ నార్త్ కొరియన్ డిక్టేటర్ కిమ్ జంగ్ వచ్చినప్పుడు జరిగే సంఘటనలతో నిండి ఉంటుంది. యాక్షన్ కామెడీగా చిత్రం నడుస్తుంది.



Click it and Unblock the Notifications











