»   » తెలుగులో వచ్చిన కథలాంటిదే హాలీవుడ్ లోనూ

తెలుగులో వచ్చిన కథలాంటిదే హాలీవుడ్ లోనూ

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: అప్పట్లో వెంకటేష్ హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సాగరకన్య సాహసవీరుడు' చిత్రం మీకు గుర్తుందా..అచ్చం అలాంటి కథతోనే ఈ హాలీవుడ్‌ చిత్రం రూపొందుతోందనేది తాజా వార్త. యూనివర్సల్‌ స్టూడియోస్‌ వారు 'లిటిల్‌ మెర్మైడ్‌' పేరు మీద ఓ లైవ్‌ యాక్షన్‌ చిత్రనిర్మాణానికి సంకల్పిస్తోంది.

ఒక మత్య్సకన్య ఓ అందాల యువరాజు ప్రేమలో పడి, తన సాగరజీవితానికి స్వస్తి పలికి, భూమి మీదకు వచ్చేయటం ఈ 'లిటిల్‌ మెర్మైడ్‌' సినిమా కథగా తెలుస్తోంది. మన తెలుగు చిత్రం కథ కూడా దాదాపుగా ఇదే థీమ్‌ కావటం విశేషం.

'The Little Mermaid' live action movie similar to our Telugu Movie

వాల్ట్‌డిస్నీ యానిమేషన్‌ స్టూడియోస్‌ సమర్పణలో 1989లో వచ్చిన 'ది లిటిల్‌ మార్మేడ్‌' (చిన్నారి సాగరకన్య) ని మర్చిపోవటం కష్టమే. ఆ సినిమా అంతలా ముద్రవేసింది. ఇప్పుడు అదే చిత్ర యూనిట్ మరోసారి జతకట్టింది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన రోన్‌ క్త్లెమెంట్‌, జాన్‌ ముస్కీర్‌లు సంయుక్తంగా మరో చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నట్లు వాల్ట్‌డిస్నీ ప్రకటించింది.

Check out this picture of Ron Clements, Jodi Benson, and John Musker working on The Little Mermaid, which opened in...

Posted by Walt Disney Animation Studios on 17 November 2015

దాదాపు 26 సంవత్సరాల విరామం తరువాత మరోసారి వీరిద్దరూ కలిసి 'మోనా' అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది నవంబర్‌ 23న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. 'ది లిటిల్‌ మార్మేడ్‌' చిత్రం కూడా 1989లో నవంబర్‌ నెలలోనే విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం విశేషం.

హాన్స్‌ క్రిస్టియన్‌ యాండర్స్‌న్‌ రాసిన ఓ ఫెయిరీటేల్‌ రిఛర్డ్‌ కర్టిస్‌ హాలీవుడ్‌ చిత్రరూపం ఇస్తున్నారు. ప్రముఖ దర్శకుడు ఫ్రాన్సిస్‌ ఫోర్డ్‌ కొప్పోలా (ఆఫ్‌ 'గాడ్‌ఫాదర్‌' సిరీస్‌) కుమార్తె సోఫియా కొప్పోలా దర్శకత్వం వహిస్తుందన్న వార్తలు వచ్చాయి.

'The Little Mermaid' live action movie similar to our Telugu Movie

కానీ, సృజనాత్మకమయిన కొన్ని విభేదాల కారణంగా తాను ఆ బాధ్యతలనుంచి తప్పుకున్నట్లు ఆమె ప్రకటించారు. అదే సమయంలో, ఈ చిత్రంలో నటించేందుకు తాను అంగీకరించానని నటీమణి క్లో మోరెట్జ్‌, ట్వీట్‌ చేసింది. క్లో మోరెట్జ్‌ చేతిలో ఇప్పుడు 'నవంబర్‌ క్రిమినల్స్‌' 'నైబర్‌2', 'ఫిప్త్‌ వేవ్‌' వంటి చిత్రాలు ఉన్నాయి. బహుశా ఈమే సాగరకన్య నటించవచ్చుననే వదంతులు ఉన్నాయి. మరి, యువరాజు ఎవరు నటిస్తారో వేచి చూడాలి.

English summary
Chloe Grace Moretz, the 18-year-old actress and starrer of films such as "The Amityville Horror" and "Diary of a Wimpy Kid," lands the lead role of Ariel in a Working Title–Universal adaptation of Disney's well-loved "The Little Mermaid" in a live-action version of the film.
Please Wait while comments are loading...