»   » ట్రైలర్ అదిరింది.... మరో సాంకేతిక అద్భుతం (వీడియో)

ట్రైలర్ అదిరింది.... మరో సాంకేతిక అద్భుతం (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: సైన్స్ ఫిక్షన్ సినిమాలకు, కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్‌ సీన్లకు హాలీవుడ్ పెట్టింది పేరు. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించే తీసే ఈ సినిమాల ఖర్చు కూడా భారీగానే ఉంటుంది. తాజాగా హాలీవుడ్ నుండి ఇలాంటి మరో అద్భుతం రాబోతోంది. ‘ది మార్షియన్' పేరుతో తెరకెక్కే ఈ చిత్రం ట్రైలర్ తాజాగా విడుదలై ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

అరుణ గ్రహానికి వెళ్లిన వ్యోమగాములు అక్కడ ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నారు అనే కథాంశంతో ఈచిత్రం తెరకెక్కుతోంది. ప్రఖ్యాత నవల ‘ది మార్షియన్' ఆధారంగా అదే పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి రిడ్లీ స్కాట్ దర్శకత్వం వహిస్తుండగా...20th Century Fox ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతోంది.

మాట్ డామన్, జెస్సికా చాస్టియన్, క్రిస్టెన్ విగ్, జెఫ్ డేనియల్, కేట్ మారా, సీన్ బీన్, సెబాస్టియన్ స్టాన్, డోనాల్డ్ గ్లోవర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం నవంబర్ 25, 2015న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 3డిలో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ పై మీరూ ఓ లక్కేయండి.

English summary
THE MARTIAN Official Trailer: During a manned mission to Mars, Astronaut Mark Watney (Matt Damon) is presumed dead after a fierce storm and left behind by his crew. But Watney has survived and finds himself stranded and alone on the hostile planet.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu