కొత్త సూపర్ మ్యాన్ డ్రస్సు, హెయిర్ స్టయిల్ అదిరిందోచ్..
సూపర్ మ్యాన్ అంటేనే ప్రత్యేకమైన పవర్స్ కలిగినటువంటి మనిషి మాత్రమే కాదు, ఓ ఐకానిక్ హీరో అర్దం. అతను చేసేటటువంటి సాహాసాలు తెరమీద చూడాలంటే రెండు కళ్లు చాలవు అంటే నమ్మండి. ఒళ్లు గగుర్పోడిచేలా అతను చేసేటటువంటి సాహాసాలు ఉంటాయి. సూపర్ మ్యాన్ సిరిస్‌ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేటటువంటి వార్నర్ బ్రదర్స్ ప్రపంచానికి ఓ సరిక్రొత్త సూపర్ మ్యాన్‌ని పరిచయం చేయనున్నారు. త్వరలో విడుదల కానున్న సూపర్ మ్యాన్ సిరిస్‌లో బ్రిటిష్ యాక్టర్ హెన్రీ కావిల్ కొత్త సూపర్ మ్యాన్‌గా నటించనున్నారు.
హెన్రీ కావిల్‌తో పాటు అమీ ఆడమ్స్, రస్సెల్ క్రోన్ కోస్టార్స్‌గా నటించనున్నారు. ఈ సినిమాని వార్నర్ బ్రదర్స్ సమర్పణలో జాక్ స్నైడర్ దర్శకత్వం వహిస్తుండగా, క్రిస్టోఫర్ నోలన్ ప్రోడ్యూస్ చేయనున్నారు. ప్రస్తుతానికి సూపర్ మ్యాన్‌కి సంబంధించిన పోటో స్టిల్స్ ని మాత్రమే మార్కెట్లోకి విడుదల చేయడం జరిగింది. ఈ సినిమా నిర్మాణ కార్యక్రమాలన్నీ పూర్తి చేసి 2013లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇక కొత్త సూపర్ మ్యాన్‌కి సంబంధించిన ఫోటోని ఈ ప్రక్క చిత్రంలో చూడోచ్చు. గతంలో సూపర్ మ్యాన్ ధరించేటటువంటి డ్రస్సుకి, కొత్త సూపర్ మ్యాన్ ధరించే డ్రస్సులో కొన్ని మార్పులు చేయడం జరిగింది. ముఖ్యమైన మార్పులు ఏమిటంటే సూపర్ మ్యాన్ ధరించిన డ్రస్సుకి డార్క్ కలర్ వేసి, హెయిర్ స్టయిల్‌ని కూడా కొంచెం హాంకీగా మార్పుచేయడం జరిగింది.


Click it and Unblock the Notifications











