ఆస్కార్ అవార్డుల విజేతల వివరాలు
లాస్ఏంజిల్స్ : 85వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం లాస్‌ఏంజిల్స్‌లో వైభవంగా ప్రారంభమైంది. ప్రపంచంలోని సినీప్రియులంతా కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న అస్కార్ పురస్కారాల పండుగ సోమవారం ఉదయం ప్రారంభమైంది. లాస్ఏంజిల్స్‌లో జరుగుతున్న అవార్డుల ప్రధానోత్సవంలో భారతీయ నేపథ్యంలో వచ్చిన 'లైఫ్ ఆఫ్ పై' సినిమాకు అవార్డుల పంట పండింది.
'లైఫ్ ఆఫ్ పై' కథ విషయానికి వస్తే....పటేల్ అనే పదహారేళ్ల కుర్రాడు తల్లితండ్రులు, కొన్ని జంతువులతో కలిసి పెద్ద పడవలో పసిఫిక్ మహా సముద్రంలో ప్రయాణిస్తుంటాడు. పెను తుపాను ధాటికి వారందరికీ దూరమై చిన్న పడవలోకి మారతాడు. అందులో ఓ పులి కూడా ఉంటుంది. దాన్నుంచి తనను కాపాడుకొంటూ మిగిలిన ప్రయాణం ఎలా సాగించాడనే కథతో 'లైఫ్ ఆఫ్ పై' రూపొందింది. ఆంగ్‌లీ దర్శకత్వంలో రూపొందింది. ఆయన గిల్ నెట్టెర్, డేవిడ్ వొమార్క్‌లతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఉత్తమ విదేశీ భాషా చిత్రం గా ఎన్నికైన అమోర్ విషయానికి వస్తే... మైఖేల్ హన్‌కే దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. మార్గరెట్ మెనెగోజ్, స్టీఫ్యాన్ అర్న్‌డ్ట్, వీట్ హీడ్‌స్చుక, మైఖేల్ కట్జ్ నిర్మించారు. 'అమోర్' కథ విషయానికొస్తే... పదవీ విరమణ పొందిన ఓ సంగీత శిక్షకురాలు, ఆమె భర్త చుట్టూ తిరుగుతుంది. వారి జీవితంలోని అంతిమ క్షణాల్ని తెర మీద ఆవిష్కరించారు. ఆ దంపతుల మధ్య భావోద్వేగాల్ని పండించడంలో దర్శకుడు సఫలీకృతుడయ్యాడు. అందుకే ఈ సినిమా ఆస్కార్ బరిలో నిలిచింది.
అస్కార్ అవార్డుల విజేతల వివరాలు:
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: లైఫ్ ఆఫ్ పై
ఉత్తమ యానిమేషన్ చిత్రం: బ్రేవ్
ఉత్తమ సినిమాటోగ్రఫీ : క్లాడియో మిరాండ (లైఫ్ ఆఫ్ పై)
ఉత్తమ యానిమేషన్ లఘు చిత్రం: పేపర్ మ్యాన్
ఉత్తమ సహాయ నటుడు : క్రిస్టోఫో వాజ్
ఉత్తమ షార్ట్ ఫిల్మ్: కర్ఫ్యూ
ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం: సెర్బింగ్ ఫర్ షుగర్ మేన్
ఉత్తమ విదేశీ భాషా చిత్రం: అమోర్
భారతీయ నేపథ్యంలో వచ్చిన లైఫ్ ఆఫ్ పై 11 విభాగాల్లో పోటీ పడుతోంది. ఉత్తమ సినిమాటోగ్రఫి, విజువల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో లైఫ్ ఆఫ్ పై చిత్రానికి అవార్డులు దక్కాయి. ఎన్నో అంచనాలతో ముందుకొచ్చిన లింకన్ చిత్రం ఇంకా ఖాతా తెరవలేదు


Click it and Unblock the Notifications











