కరోనాపై "ది రాక్" విజయం... కుటుంబం మొత్తం పోరాడిన వైనం
డ్వేన్ జాన్సన్, ఈ పేరు కన్నా, ది రాక్ అంటే మన జనాలకు బాగా కనెక్ట్ అవుతుంది. అంతర్జాతీయంగా ఈ పేరుతోనే పాపులర్ అయిన ఈ WWE వీరుడు, సిల్వర్ స్క్రీన్ పై విలన్స్ తో పోరాడి విజయం సాధించినట్లే, నిజ జీవితంలోనూ ఓ పెద్ద యుద్ధమే చేసి విజయకేతనం ఎగరవేశాడు. ఇంతకూ అతడు దేనిపై విజయం సాధించాడని అంటారా? ప్రపంచదేశాల్ని వణికిస్తున్న కరోనా వైరస్ పై.
ఓ వీడియో ద్వారా తన కుటుంబం మొత్తం వైరస్ బారిన పడినట్లు ప్రకటించాడు డ్వేన్. భార్య, ఇద్దరు చిన్నారులతో పాటూ తనకూ కోవిడ్ 19 టెస్ట్ నిర్వహించగా, పాజిటివ్ వచ్చినట్లు వెల్లడించాడు. అయితే ప్రస్తుతం కుటుంబం మొత్తం కోలుకుందని తెలిపాడు.

రెండు వారాల క్రితం తమ కుటుంబానికి అత్యంత సన్నిహితులైన వ్యక్తుల ద్వారా ఈ వైరస్ బారిన పడినట్లు తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. వైరస్ బారిన పడిన తరువాత కట్టుదిట్టమైన క్వారంటైన్ పాటించినట్లు వెల్లడించాడు. తాను, తన భార్య వైరస్ వల్ల తీవ్రం అశ్వస్థకు గురైనప్పటికీ, తమ కుమార్తెలు నాలుగేళ్ల జాస్మిన్, రెండేళ్ల టియానా కేవలం గొంతు నొప్పితో మాత్రమే బాధపడ్డారని తెలిపాడు.
ఇది తమ కుటుంబానికి అత్యంత క్లిష్టమైన సమయమని చెప్పాడు. ప్రస్తుతం తాము పూర్తి స్వస్థతో ఉన్నామని వెల్లడించిన డ్వేన్, తమ కుటుంబం సమిష్ఠి కృషితో ప్రమాదకరమైన వైరస్ పై విజయం సాధించామని తెలిపాడు. అంతేకాదు, ఈ ప్రాణాంతక వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని ప్రజలను కోరాడు.


Click it and Unblock the Notifications











