twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    2016లో టాప్ వసూళ్లు సాధించిన మూవీ స్టార్స్ వీరే... (లిస్ట్)

    ఫోర్బ్స్ మేగజైన్ వెల్లడించిన వివరాల ప్రకారంస్కార్లెట్ జాన్సన్ నటించిన మూవీ ప్రపంచ వ్యాప్తంగా టికెట్ సేల్స్ ద్వారా 1.2 బిలియన్ డాలర్స్(రూ. 8 వేల కోట్లు పైచిలుకు) వసూలు చేసింది.

    By Bojja Kumar
    |

    లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ స్టార్ స్కార్లెట్ జాన్సన్ 2016లో టాప్ వసూళ్లు సాధించిన మూవీ స్టార్‌గా రికార్డుల కెక్కారు. ప్రపంచ ప్రఖ్యాత ఫోర్బ్స్ మేగజైన్ వెల్లడించిన వివరాల ప్రకారం ఆమె నటించిన మూవీ ప్రపంచ వ్యాప్తంగా టికెట్ సేల్స్ ద్వారా 1.2 బిలియన్ డాలర్స్(రూ. 8 వేల కోట్లు పైచిలుకు) వసూలు చేసింది.

    స్కార్లెట్ జాన్సన్ ఈ ఏడాది నటించిన 'కేప్టెన్ అమెరికా: సివిల్ వార్' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా బిగ్గెస్ట్ బాక్సాఫీసు హిట్ గా నిలించింది. ఈ చిత్రం వరల్డ్ వైడ్ 1.15 బిలియన్ డాలర్లు వసూలు చేసింది. జాన్సన్ తన కోస్టార్స్ క్రిస్ ఇవాన్స్, రాబర్ట్ డైనీ జూనియర్ కంటే కాస్త ముందున్నారు. అందుకు కారణం ఆమె ఈ సినిమాతో పాటు సియోన్ బ్రదర్స్ హైలీ, సీసర్ సినిమాలో కూడాఈ చిత్రం 63.2 మిలియన్ డాలర్లు వసూలు చేసింది.

    దీంతో పాటు ఈ ఏడాది ఆగస్టులో ఫోర్బ్స్ మేగజైన్ విడుదల చేసిన హయ్యెస్ట్ పేయిడ్ యాక్టర్ల లిస్టులో 25 మిలియన్ డాలర్ల రెమ్యూనరేషన్తో మూడవ స్థానంలో నిలిచారు. ఈ ఏడాది టాప్ 10 గ్రాసింగ్ యాక్టర్ల వివరాలపై ఓ లుక్కేద్దాం...

    స్కార్లెట్ జాన్సన్

    స్కార్లెట్ జాన్సన్

    స్కార్లెట్ జాన్సన్ నటించిన చిత్రాలు 2016లో 1.2 బిలియన్ డాలర్లు(రూ. 8 వేల కోట్ల పైచిలుకు) వసూలు చేసింది.

    క్రిస్ ఇవాన్స్

    క్రిస్ ఇవాన్స్

    క్రిస్ ఇవాన్స్ ఈ ఏడాది ‘కేప్టెన్ అమెరికా: సివిల్ వార్' చిత్రంలో నటించారు. ఈచిత్రం 1.15 బిలియన్ డాలర్లు వసూలు చేసింది.

    రాబర్ట్ డౌనీ జూనియర్

    రాబర్ట్ డౌనీ జూనియర్

    రాబర్ట్ డౌనీ జూనియర్ ఈ ఏడాది ‘కేప్టెన్ అమెరికా: సివిల్ వార్' చిత్రంలో నటించారు. ఈచిత్రం 1.15 బిలియన్ డాలర్లు వసూలు చేసింది.

    మార్గోట్ రోబీ

    మార్గోట్ రోబీ

    హాలీవుడ్ స్టార్ మార్గోట్ రోబీ నటించిన చిత్రాలు 2016 ఏడాది 1.1 బిలియన్ డాలర్లు(రూ. 7.5 వేల కోట్లు) వసూలు చేసాయి.

    అమీ ఆడమ్స్

    అమీ ఆడమ్స్

    హాలీవుడ్ స్టార్ అమీ ఆడమ్స్ నటించిన చిత్రాలు ఈఏడాది 1.04 బిలియన్ డాలర్స్(రూ. 7 వేల కోట్ల పైచిలుకు) వసూలు చేసింది.

    బెన్ అఫ్లెక్

    బెన్ అఫ్లెక్

    హాలీవుడ్ స్టార్ బెన్ అఫ్లెక్ నటించిన చిత్రాలు ఈ ఏడాది 1.02 బిలియన్ డాలర్లు(రూ. 6.9 వేల కోట్లు) వసూలు చేసింది.

    హెన్రీ సివిల్

    హెన్రీ సివిల్

    హాలీవుడ్ స్టార్ హెన్సీ సివిల్ నటించిన సినిమాలు ఈ ఏడాది 870 మిలియన్ డాలర్లు(రూ. 5.9 వేల కోట్లు) వసూలు చేసింది.

    ర్యాన్ రేనాల్డ్స్

    ర్యాన్ రేనాల్డ్స్

    హాలీవుడ్ స్టార్ ర్యాన్ రేనాల్డ్స్ నటించిన చిత్రాలు ఈ ఏడాది 820 మిలియన్ డాలర్లు(5.58 వేల కోట్లు) వసూలు చేసింది.

    ఫెలిసిటీ జాన్స్

    ఫెలిసిటీ జాన్స్

    హాలీవుడ్ స్టార్స్ ఫెలిసిటీ జాన్స్ నటించిన చిత్రాలు ఈ ఏడాది 805 మిలియన్ డాలర్లు(రూ. 5.48 వేల కోట్లు) వసూలు చేసింది.

    విల్ స్మిత్

    విల్ స్మిత్

    హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ నటించన చిత్రాలు ఈ ఏడాది 775 మిలియన్ డాలర్లు(రూ. 5.27 వేల కోట్లు) వసూలు చేసింది.

    English summary
    Scarlett Johansson has been named the top grossing movie star of 2016 by Forbes magazine after appearing in films that amassed $1.2 billion in global ticket sales. The Tony Award-winning American actress starred in the Marvel blockbuster 'Captain America: Civil War,' the year's biggest box office hit, which made $1.15 billion worldwide.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X