2013: ఎక్కువ డౌన్ లోడ్ అయిన చిత్రాలు( టాప్ 10)

By Srikanya

లాస్ ఏంజిల్స్ : ఈ రోజుల్లో టోరెంట్స్ గురించి తెలియని వారు ఉండటం లేదు. వాస్తవానికి సినిమాలు పైరసీ అనేది పెద్ద నేరం. అయితే ఆన్ లైన్ ద్వారా అని నిరాఘాటంగా జరిగిపోతూనే ఉంది. సినిమాని థియోటర్స్ కి వెళ్లి చూడనివాళ్లు...నెట్ లో టోరెంట్స్ డౌన్ లోడ్ చేసుకుని మరీ చూసేస్తూంటారు. అది క్రైమ్ అని తెలిసినా పెద్దగా లక్ష్య పెట్టరు.

తమ సినిమాలు పైరసీ చేసేస్తున్నారు అని గోలెత్తిపోయే సినిమావారు సైతం ఈ విషయంలో అతీతులు కారు. తమ సినిమాలు తప్ప మిగతావి టోరెంట్స్ డౌట్ లోడ్ చేసేస్తూనే ఉంటారు..చూస్తూనే ఉంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ పైరసీ టోరెంట్ వ్యాపారం ఏ అడ్డూ అదుపూ లేకుండా జరిగిపోతూ ఉంది.

ఆ టోరెంట్స్ వ్యాపారం ఎంత దూరం వెళ్ళిదంటే..ఎక్కువ టోరెంట్స్ డౌన్ లోడ్ అయ్యిన సినిమాకి క్రేజ్ ఎక్కువ అనే స్ధాయి దాకా. దీంతో కొన్ని ఆన్ లైన్ వెబ్ సైట్స్ ఎక్కువ టోరెంట్స్ డౌన్ లోడ్ అయిన చిత్రాలు లిస్ట్ లు సైతం పబ్లిష్ చేస్తూంటాయి. రీసెంట్ గా టోరెంట్ ఫ్రీక్ వారు ఈ లిస్ట్ విడుదల చేసారు. 2013లో ఎక్కువ డౌన్ లోడ్ అయ్యిన చిత్రాలు లిస్ట్ విడుదల చేసారు.

టాప్ 10 స్లైడ్ షోలో...

The Hobbit: An Unexpected Journey

The Hobbit: An Unexpected Journey

పీటర్ జాక్సన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం భారీ బడ్జెట్ తో రూపొంది, కలెక్షన్స్ కూడా భారీగానే వసూలు చేసింది. అయితే మళ్లీ మళ్లీ చూడాలనుకునే ప్రేక్షకులు ఎక్కువ ఉండటంతో ఈ చిత్రం ఎక్కువ డౌన్ లోడ్స్ అయ్యింది. 8,400,000 డౌన్ లోడ్స్ ఈ చిత్రం టాప్ ప్లేస్ లో నిలిచింది.

Django Unchained

Django Unchained

వెస్ట్రన్ అడ్వంచర్ ఫిల్మ్ గా రూపొందిన ఈ చిత్రాన్ని Quentin Tarantino డైరక్ట్ చేసారు. Jamie Foxx, Leonardo DiCaprio, Samuel L. Jackson ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం క్రితం సంవత్సరం క్రిస్ మస్ కానుకగా విడుదలై మంచి విజయం సాధించింది. ఈ చిత్రం 8,100,000 డౌన్ లోడ్స్ అయ్యాయి.

Fast And Furious 6

Fast And Furious 6

ఫ్యూరియస్ 6 అని కూడా పిలవబడే ఈ చిత్రం ఓ యాక్షన్ చిత్రం. Justin Lin డైరక్ట్ చేసిన ఈ చిత్రం ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ చిత్రాల సీరిస్ లో ఆరవ ఇన్ స్టాల్ మెంట్. భారీ చేజ్‌లు, యాక్షన్‌కు పెట్టింది పేరు ‘ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌' సిరీస్‌. ఈ సీరిస్ కి మంచి ప్రేక్షకాదరణ ఉంది. ఈ చిత్రం 7,900,000 డౌన్ లోడ్స్ అయ్యాయి.

Iron Man 3

Iron Man 3

హాలీవుడ్‌లో 'ఐరన్ మ్యాన్' సిరిస్ సినిమాలు బాక్సాఫీసు రికార్డుల్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. మార్వెల్ కామిక్స్ నుంచి రూపుదిద్దుకున్న ఐరన్ మ్యాన్ 3 సినిమా అదే రేంజిలో కలెక్షన్స్ వర్షం కురిపించింది. యాక్షన్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఐరన్ మ్యాన్ 3 సినిమాలో హీరోగా జూనియర్ రాబర్ట్ డౌనీ నటించాడు. జూనియర్ రాబర్ట్ డౌనీతో పాటు జెన్నిత్ పాల్ట్రో, డాన్ చీడ్లే, గుయ్ పీర్స్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం 7,600,000 డౌన్ లోడ్స్ అయ్యాయి.

Silver Linings Playbook

Silver Linings Playbook

ఇదే టైటిల్ తో ఉన్న నవల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ఓ రొమాంటిక్ కామెడీ. జెన్నిఫర్ లారెన్స్, బ్రాడ్లీ కూపర్, రాబర్ట్ డినీరో వంటి ప్రముఖ నటులు నటించిన ఈ చిత్రం ఆన్ లైన్ లో మంచి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం 7,500,000 డౌన్ లోడ్స్ అయ్యాయి.

Star Trek Into Darkness

Star Trek Into Darkness


కమర్షియల్ గా మంచి విజయం సాధించిన ఈ చిత్రం ఓ సైన్స్ ఫిక్షన్ యాక్షన్. స్టార్ ట్రెక్ ఫిల్మ్ ప్రాఛైజీ ఇది. జె.జె అబ్రహం డైరక్ట్ చేసిన ఈ చిత్రం 7,400,000 సార్లు డౌన్స్ లోడ్స్ అయ్యింది.

Gangster Squad

Gangster Squad


యాక్షన్ క్రైమ్ చిత్రంగా వచ్చిన ఈ సినిమాని Ruben Fleischer డైరక్ట్ చేసారు. ఈ చిత్రం లాస్ ఏంజిల్స్ పోలీస్ డిపార్టమెంట్,డిటెక్టివ్స్ కలిపి 1940,50 మధ్యలో ఏర్పాటు చేసిన గ్యాంగస్టర్ స్క్వాడ్ యూనిట్ లో జరిగిన నిజ జీవిత సంఘటనలు ఆధారంగా రూపొందించారు. ఈ చిత్రం 7,200,000 సార్లు డౌన్ లోడ్ అయ్యింది.

Now You See Me

Now You See Me


మే 31,2013 లో విడుదల ఈ ప్రెంచ్,అమెరికన్ థ్రిల్లర్ చిత్రం రిలీజ్ కు ముందు నుంచే మంచి క్రేజ్ తెచ్చుకుంది. అక్కడక్కడా నెగిటివ్ రివ్యూలు తెచ్చుకున్నా భక్సాఫీస్ కలెక్షన్స్ కు మాత్రం లోటు లేదు. ఈ చిత్రానికి సీక్వెల్ కూడా రెడీ అవుతోంది. ఈ చిత్రం 7,000,000 సార్లు డౌన్ లోడ్ అయ్యింది.

The Hangover Part 3

The Hangover Part 3


హ్యాంగోవర్ చిత్రం గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు. ఈ లో బడ్జెట్ చిత్రం భాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపించింది. ఈ చిత్రం ఆధారంగా ఇండియాలోనూ ఎన్నో సినిమాలు తెరకెక్కాయి..ఎక్కుతున్నాయి. ఈ చిత్రం మూడో సీక్వెల్ ...6,900,000 సార్లు డౌన్ లోడ్ అయ్యింది.

World War Z

World War Z

హాలీవుడ్ రోమాంటిక్ హీరో బ్రాడ్ పిట్ నటించిన చిత్రం 'వరల్డ్ వార్ జడ్'. ఈ సినిమాకి దర్శకత్వం మార్క్ ఫోస్టర్ వహించారు. ఈ సినిమాలో బ్రాడ్ పిట్ లీడ్ రోల్ పోషించగా, మ్యాధ్యూ ఫాక్స్, డేవిడ్ మోర్స్ కూడా నటించారు. ఇక ఈ సినిమాని ప్రముఖ నవలా రచయిత మాక్స్ బ్రూక్స్ రాసినటువంటి రియల్ స్టోరీ ఆధారంగా తీయడం జరుగింది. ఈ చిత్రం 6,700,000 సార్లు డౌన్ లోడ్స్ కు గురి అయ్యింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X