»   » అదిరిపోయే యాక్షన్: ‘ది ట్రాన్స్‌పోర్టర్-4’ (ట్రైలర్)

అదిరిపోయే యాక్షన్: ‘ది ట్రాన్స్‌పోర్టర్-4’ (ట్రైలర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ యాక్షన్ చిత్రాల్లో ‘ది ట్రాన్స్‌పోర్టర్' సిరీస్ చిత్రాలకు మంచి డిమాండ్ ఉంది. ఇప్పటికే ఈ సీరీస్‌లో వచ్చిన మూడు చిత్రాలు ఘన విజయం సాధించాయి. ఈ మూడు చిత్రాల్లో హాలీవుడ్ యాక్షన్ స్టార్ జాసన్ స్టాటమ్ నటించారు. అయితే ఈ సారి రాబోయే ‘ది ట్రాన్స్‌పోర్టర్-4' చిత్రంలో మాత్రం ఎడ్ స్క్రేన్ హీరోగా నటిస్తున్నాడు.

The Transporter Refueled - Official Trailer

‘ది ట్రాన్స్‌పోర్టర్-రిఫ్యూయల్డ్' పేరుతో వస్తున్న ఈ నాలుగో ఎడిషన్‌కు కామిలి డెలమర్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ అఫీషియల్ ట్రైలర్ విడుదల చేసారు. ఊపిరి బిగబట్టే ఉత్కంఠ భరితమైన యాక్షన్ సన్నివేశాలతో ఈ ట్రైలర్ అదిరిపోయిందని ట్రాన్స్ పోర్టర్ చిత్రాల అభిమానులు అంటున్నారు.

సెప్టెంబర్ 4, 2015న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చిత్రంలో ఇంకా రే స్టెవెన్సన్, గాబ్రియేల్లా వైట్ తదితరులు నటిస్తున్నారు.

English summary
The stakes are greater but the same three rules apply: never change the deal, no names, & never open the package. #TheTransporter Refueled – In Theaters September 4, 2015.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu