వచ్చే వేసవిలో ఆ సూపర్ హిట్ సినిమా సీక్వెల్...!!

By Kuladeep

ఇటీవలే విడుదలయిన 'ది ట్విలైట్ స్యాగా: న్యూ మూన్' సినిమా ఎంత ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత నెలలో విడుదలయిన ఈ సినిమా రికార్డు స్థాయి కలెక్షన్లతో హాలీవుడ్ బాక్సాఫీసు వద్ద కనక వర్షం కురిపిస్తోంది. 2012, బ్లైండ్ సైడ్ వంటి ప్రతిష్టాత్మక చిత్రాల మధ్య విడుదలయిన ఈ సినిమా వాటి ధాటిని తట్టుకొని వరుసగా మూడు వారాల పాటు బాక్సాఫీసు వద్ద కలెక్షన్లలో మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంది.

ఈ సినిమా క్రితం ఏడాది విడుదలయిన సూపర్ హిట్ సినిమా ట్విలైట్ కు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. ఈ ట్విలైట్ సినిమా కూడా రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది. కాగా తాజాగా ఈ సినిమా సీక్వెల్ లలో భాగంగా రూపుదిద్దుకుంటున్న తాజా సీక్వెల్ 'ఎక్లిప్స్'.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టడమే కాకుండా ఎంతో మంది అభిమానాన్ని చూరగొన్న ఈ సినిమా కు రాబోయే ఈ సీక్వెల్ పై మంచి అంచనాలే వున్నాయి. ఈ సినిమా కూడా గత సినిమాల్లాగే రికార్డులను తిరగరాస్తుందని నిర్మాతుల ధీమా వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X