సత్తా చాటుతున్న 'ఆత్మ' కథ- హాలీవుడ్ ట్రేడ్ రిపోర్ట్

By Kuladeep

హాలీవుడ్ లో ఈ వారం ట్రేడ్ రిపోర్ట్ లో మరో సారి 'ట్విలైట్' సినిమాకు సీక్వెల్ గా వచ్చిన 'న్యూ మూన్' సినిమా తన ప్రతాపాన్ని చూపించి మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. 42.5 మిలియన్ డాలర్లు వసూలు చేసి ఈ సినిమా ఈ ఘనతను సాధించింది. ప్రేమలో పడ్డ ఓ ఆత్మ కథ చుట్టూ అల్లుకున్న ఈ సినిమా రికార్డు స్థాయి వసూల్లతో ప్రపంచం మొత్తం స్వైరవిహారం చేస్తోంది. ఆ తర్వాతి స్థానంలో 'ది బ్లైండ్ సైడ్' సినిమా నిలిచింది. ఈ సినిమా 40.1 మిలియన్ డాలర్లు వసూలు చేసి రెండవ స్థానాన్ని నిలబెట్టుకుంది. 2012తో ఈ కలియుగం అంతం అయిపోనుంది అనే కథాంశంతో ఎన్నో అంచనాలతో వచ్చిన 2012 సినిమా వీక్ స్క్రీన్ ప్లే కారణంగా ప్రేక్షకులని నిరాశపరిచినా, అద్భుతమయిన సాంకేతిక విలువలతో రూపొందిన ఈ చిత్రం 18 మిలియన్ డాలర్లను వసూలు చేసి మూడవ స్థానంలో నిలిచింది.

కాగా ఈ వారం బాక్సాఫీస్ కనకవర్షం కురిపించిన తొలి పది సినిమాల వివరాలు ఇలా వున్నాయి.

1. న్యూ మూన్ ---- 42.5 మిలియన్ డాలర్లు
2. ది బ్లైండ్ సైడ్ ---- 40.1 మిలియన్ డాలర్లు
3. 2012 ---- 18 మిలియన్ డాలర్లను
4. ఓల్డ్ డాగ్స్ ---- 16.8 మిలియన్ డాలర్లను
5. ఎ క్రిస్ట్ మస్ కరోల్ ---- 16 మిలియన్ డాలర్లను
6. నింజా అస్సెస్సిన్ ---- 13.1 మిలియన్ డాలర్లను
7. ప్లానెట్ 51 ---- 10.2 మిలియన్ డాలర్లను
8. ప్రీషియస్ ---- 7.1 మిలియన్ డాలర్లను
9. ఫెంటాస్టిక్ మిస్టర్ ఫాక్స్ ---- 7 మిలియన్ డాలర్లను
10. ది మెన్ హూ స్టేర్స్ అట్ గోట్స్ ---- 1.5 మిలియన్ డాలర్లను

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X