Don't Miss!
- Finance Upper Circuit: లాభాల కిక్ ఇస్తున్న లిక్కర్ స్టాక్.. 8 రోజులుగా అప్పర్ సర్క్యూట్లోనే.. కొన్నారా..??
- News నామినేషన్ వేయనున్న వైఎస్ జగన్
- Sports హార్దిక్‌కు అంబానీ వార్నింగ్.. సంచలన నిర్ణయానికి సిద్ధం!
- Automobiles ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
బెకహాం కుమారుడి పుట్టిన రోజుకి బ్రిటిష్ బ్యాండ్ ప్రదర్శన
లాస్ ఏంజిల్స్: తల్లిదండ్రులు తమ పిల్లలపై ఉన్న ప్రేమను పలు రకాలుగా వ్యక్తపరుస్తూ ఉంటారు. ఇంగ్లాండ్ స్టార్ పుట్ బాలర్ డేవిడ్ బెకహాం, అతని భార్య విక్టోరియా బెకహాం తమ 10 సంవత్సరాల కొడుకు రొమియో పుట్టినరోజు సందర్బంగా అతనిని ఆశ్యర్యంలో ముంచెత్తించేందుకు బ్రిటిష్ టాప్ బ్యాండ్లలో ఒకటైన ది వాంటెడ్ మ్యూజికల్ ప్రోగ్రాంని ఇంట్లో ఏర్పాటు చేశారు.
MTV వీడియో మ్యూజిక్ అవార్డుల కార్యక్రమంలో పాల్గోనేందుకు వచ్చిన ది వాంటెడ్ బ్యాండ్‌ని 38 ఏళ్ల వయసు కలిగిన విక్టోరియా బెకహాం రొమియో పుట్టిన రోజుకి ఆహ్వానించింది. స్పైస్ గర్ల్స్‌లో ఒకరైన విక్టోరియా బెకహాంకు ఎప్పటి నుండో బ్రిటిష్ బ్యాండ్ ది వాంటెడ్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ సంబంధాల వల్లనే రొమియో పుట్టిన రోజు వేడుకలకు విక్టోరియా ఆహ్వానించగానే వచ్చారు.
ప్రస్తుతం ది వాంటెడ్ బ్యాండ్‌లో మాక్స్ జార్జ్, నాథన్ సైక్స్, శివ కనేశ్వరన్, జే మెక్గునిస్ మరియు టామ్ పార్కర్ సభ్యులుగా ఉన్నారు. పుట్టిన రోజు అబ్బాయి రొమియోతో కలిసి వీరంతా ఫోటోలకు ఫోజులిచ్చారు. ది వాంటెడ్ బ్యాండ్‌ని తన పుట్టినరోజు నాడు ఆహ్వానించినందుకు రొమియో ఎంతో సంతోషించాడు.
ఆ తర్వాత విక్టోరియా బెకహాం తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా ది వాంటెడ్ బ్యాండ్‌కి తన కృతజ్ఞతలను తెలియజేసింది. తన ట్విట్టర్లో మ్యూజిక్‌లో కూల్ బాయ్స్‌గా పేరుగాంచిన ది వాంటెడ్ మ్యూజిక్ బాయ్స్‌కి రొమియో పదవ పుట్టిన రోజు స్పెషల్‌గా చేసినందుకు ధన్వవాదాలు అంటూ ట్వీట్ చేశారు.
తెలుగు వన్ఇండియా