»   » కుక్క కూడా రొమాంటిక్కే, ప్రియాంక చోప్రా మూవీ పెద్దలకు మాత్రమేనా? (ఫోటోస్ లీక్)

కుక్క కూడా రొమాంటిక్కే, ప్రియాంక చోప్రా మూవీ పెద్దలకు మాత్రమేనా? (ఫోటోస్ లీక్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా కొంతకాలంగా హాలీవుడ్ ప్రాజెక్టులతోనే బిజీ బిజీగా గడుపుతోంది. క్వాంటికో టీవీ సిరీస్ ద్వారా అమెరికన్ ఎంటర్టెన్మెంట్ రంగంలోకి అడుగు పెట్టిన ప్రియాంక తనదైన అందం, పెర్ఫార్మెన్స్‌తో మంచి మార్కులు కొట్టేసింది. దీంతో ఆమెకు హాలీవుడ్లో అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి.

హాలీవుడ్ స్టార్ డ్వేన్ జాన్సన్‌తో కలిసి 'బేవాచ్' సినిమా చేసిన ప్రియాంక.... ప్రస్తుతం 'ఎ కిడ్ లైక్ జేక్', 'ఈజ్ నాట్ ఇట్ రొమాంటిక్' అనే చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా 'ఈజ్ నాట్ ఇట్ రొమాంటిక్' అనే చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఫోటోలు, వీడియోలు లీక్ అయ్యాయి. ఈ ఫోటోలు చూసిన వారంతా ఇది పెద్దలకు మాత్రమే పరిమితమైన రొమాంటిక్ సినిమానేమో? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

బోల్డ్‌గా నటించిన ప్రియాంక

బోల్డ్‌గా నటించిన ప్రియాంక

‘ఈజ్ నాట్ ఇట్ రొమాంటిక్' చిత్రంలో ప్రియాంక చోప్రా చాలా బోల్డ్‌గా నటిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇండియన్ సినిమాల్లో కూడా ప్రియాంక ఎప్పుడూ ఇంత బోల్డ్ గా నటించలేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

షాకింగ్ వీడియో

డైలీమెయిల్ లీక్ చేసిన ఈ వీడియోలో హాలీవుడ్ నటుడు ఆడమ్ డివైన్ ప్రియాంకతో ప్రవర్తించిన తీరు చూసి ఇదేదో అడల్ట్ ఫిల్మ్ మాదిరి ఉందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈజ్ నాట్ ఇట్ రొమాంటిక్

ఈజ్ నాట్ ఇట్ రొమాంటిక్

ఈజ్ నాట్ ఇట్ రొమాంటిక్ చిత్రానికి టోడ్ స్ట్రాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇదొక రొమాంటిక్ కామెడీ ఫిల్మ్. ఇండియాలోనే రొమాంటిక్ కామెడీ చిత్రాలంటే ఓ రేంజిలో ఉంటాయి. మరి హాలీవుడ్లో రొమాంటిక్ డోసు కాస్త ఎక్కువగానే ఉంటుందని చెప్పొచ్చు.

రొమాంటిక్ కుక్క

ఈ సినిమాలో కుక్క కూడా చాలా రొమాంటిక్ గా ప్రవర్తిస్తుందని ప్రియాంక చోప్రా ఇనిస్టాగ్రామ్ లో పోస్టు చేసిన ఈ వీడియో చూసి అర్థం చేసుకోవచ్చు.

2019లో రిలీజ్

2019లో రిలీజ్

ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అయింది. 2019 వాలంటైన్స్ డే నాటికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. లవ్, రొమాన్స్, హాట్ సీన్లు బోలెడు ఉంటాయని స్పష్టమవుతోంది.

English summary
After her sizzling act in Baywatch, there's some more of Priyanka Chopra happening in Hollywood! We recently told you that PeeCee has bagged two more flicks- 'A Kid Like Jake' and 'Isn't It Romantic?' The 'Quantico' actress has kick-started the shooting for 'Isn't It Romantic?' which has her playing the role of a yoga ambassador named Isabella. We stumbled upon a few pictures of PC from the sets and boy, we now just can't contain our excitement for PeeCee magic.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X