థోర్-2 (ది దార్క్ వరల్డ్) ఈ రోజే
లాస్ ఏంజిల్స్: హాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన 'ది ఎవెంజర్స్' చిత్రాన్ని అందించిన వాల్ట్ డిస్నీ సంస్థ అందిస్తున్న మరో భారీ ఫాంటసీ సినిమా 'థోర్: ద డార్క్ వరల్డ్'. ఇటీవల 'సూపర్‌మేన్', 'పసిఫిక్ రిమ్' వంటి సూపర్‌హిట్ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన సెన్సేషనల్ మూవీస్ అధినేత గోగినేని బాలకృష్ణ ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్ అంతటా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో 2డి, 3డి వెర్షన్లలో శుక్రవా రం విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "కామిక్స్‌ను సినిమాలుగా తీయడంలో వాల్ట్ డిస్నీని మించిన సంస్థ లేదు. ఆ తరహాలో వస్తున్న విజువల్ వండర్ 'థోర్: ద డార్క్ వండర్'. 'ది ఎవెంజర్స్'లో ఓ హీరోగా నటించి, తనదైన శైలిలో ప్రేక్షకుల్ని అలరించిన క్రిస్ హెమ్స్‌వర్త్ ఈ చిత్రంలో హీరోగా నటించారు. ఇది అడ్వంచరస్ యాక్షన్ ఎంటర్‌టైనర్. ఈ చిత్రాన్ని మా బేనర్ ద్వారా విడుదల చేస్తున్నందుకు గర్వంగా ఉంది' అన్నారు. నటాలీ పోర్ట్‌మన్, టామ్ హిడెల్‌స్టన్, క్రిస్టఫర్ ఎకిల్‌స్టన్, జైమీ అలెగ్జాండర్, ఆంథోనీ హాప్‌కిన్స్, రెనీ రుస్సో, ఇద్రిస్ ఎల్బా తారాగణమైన ఈ చిత్రానికి అలన్ టేలర్ దర్శకుడు.

ది ఎవెంజర్స్ చిత్రంలో లీడ్‌రోల్ పోషించి, తనదైన శైలిలో ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేసిన ఆ చిత్ర మీరో క్రిస్ హెమ్స్‌వర్త్ ఈ థోర్‌లో ప్రధాన పాత్ర పోషించాడు. ఇది అడ్వంచర్ యాక్షన్ చిత్రం. కళ్తు చెదిరే విజువల్ వండర్స్‌తో ఆకర్షణీయమైన అంశాలతో ఈ థోర్-2చిత్రం రూపొందించారు. ఈ చిత్రం ఈనెల 8న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో విడుదలవుతోంది. 2డి, 3డి వెర్షన్స్‌లో ఈ చిత్రాన్ని అత్యధిక థియేటర్లలో విడుదలచేస్తున్నాం'' అన్నారు. క్రిస్ హెమ్స్‌వర్త్, నటాలి పోర్ట్‌మెన్, టామ్ హెడెల్‌స్టన్, స్టెల్లన్ స్కార్స్‌గార్డ్, ఇడ్రీస్ ఇల్బా, క్యాట్ డిన్నింగ్స్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి దర్శకత్వం.. అలన్ టేలర్.


Click it and Unblock the Notifications











