For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్రిడ్డిపై నుంచి హైవేపై దూకి యాక్టర్ ఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!

|

హాలీవుడ్ నటుడు ఐసాక్ కప్పీ ఆత్మహత్య సంచలనం రేపింది. ఆయన మరణంతో సహచర నటులు, సినీ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. హలీవుడ్ చి్తరం థోర్ సినిమా ద్వారా ప్రపంచ సినీ ప్రేక్షకులకు ఆయన సుపరిచితుడు. సోమవారం రాత్రి బ్రిడ్జిపై నుంచి దూకి బలవన్మరణం పొందిన వార్త బయటకు పొక్కడంతో హలీవుడ్ వర్గాలు తీవ్ర షాక్ లోనయ్యారు. మరణానికి ముందు ఆయన రాసిన లేఖ ప్రతీ ఒక్కరిని కంటతడి పెట్టించడమే కాకుండా భావోద్వేగానికి గురిచేస్తున్నది. ఆయన రాసిన లేఖలో ఏమున్నదంటే..

మానసిక సంఘర్షణ కారణంగా

కొద్దికాలంగా మానసిక సంఘర్షణకు లోనైన ఇసాక్ కప్పీ సోమవారం అరిజోనాలోని ఓ బ్రిడ్జిపైకి ఎక్కి సూసైడ్‌కు ప్రయత్నించారు. ఆయనను చూసిన ఇద్దరు యువకులు ఆత్మహత్యను ఆపేందుకు ప్రయత్నించారు. కానీ బ్రిడ్జి మీద నుంచి కిందకు దూకడంతో రోడ్డుపై వెళ్తున్న ఓ వాహనం ఢీకొట్టింది. దాంతో ఆయన అక్కడికక్కడే మరణించాడు అని అరిజోనా డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ సెఫ్టీ అధికారులు వెల్లడించారు.

మరణానికి ముందు సోషల్ మీడియాలో

మరణానికి ముందు ఐజాక్ కప్పీ తన ఇన్స్‌టాగ్రామ్‌ అకౌంట్‌లో అనేక పోస్టులు పెట్టాడు. గతవారం రోజులుగా నాకు నేను ఆత్మ పరిశీలన చేసుకొన్నాను. కానీ అది ఎప్పుడో చేసుకోవాల్సిందనిపించింది. నా క్యారెక్టర్ గురించి కొన్ని భయంకరమైన నిజాలు చెప్పాలనుకొంటున్నారు. నా గురించి మీకే సరిగా తెలియదు. నేను చాలా ఉద్రేకపూరితమైన వ్యక్తిని. మీరందరూ అనుకొంటున్నట్టు మంచి వాడిని కాదు అని పోస్టులో పేర్కొన్నాడు.

అనేక మోసాలకు పాల్పడ్డాను

నా జీవితంలో చాలా మందిని వాడుకొన్నాను. డబ్బు కోసం మోసగించాను. డబ్బు కోసం డ్రగ్స్ అమ్మాను. పన్ను ఎగవేతకు పాల్పడ్డాను. అప్పుల బారిన పడ్డాను. సిగిరెట్లు, డ్రగ్స్, మద్యానికి బానిసనయ్యాను. నన్ను ప్రేమించే వారిని, నా ఫ్యామిలినీ విపరీతంగా ద్వేషించాను. జూదం ఆడటం ద్వారా డబ్బు పొగొట్టుకొన్నాను. చాలా నీచమైన పనులు చేశాను.

నా పాపాలకు మరణమే శిక్ష

జీవితమంతా చూసుకొంటే నేను ఎలాంటి విలువలు పాటించకుండా బతికాను. నేను చేసిన పనులకు శిక్ష వేసుకోవాలనుకొన్నాను. జీసస్‌, డొనాల్డ్ ట్రంప్‌ను మోసగించాను. నా మరణంతో వారికి క్షమాపణ చెప్పినట్టు అవుతుంది. నేను చేసిన పాపాలకు పరిహారం చెల్లించనట్టు అవుతుంది అంటూ సుదీర్ఘమైన లేక రాశాడు. కప్పీ రాసిన లేఖ ప్రతీ ఒక్కరిని భావోద్వేగానికి గురిచేస్తున్నది. నెటిజన్లు ఆయన ఆత్మకు శాంతి కలుగాలని ప్రార్థించారు.

థోర్ సినిమాతో గుర్తింపు తెచ్చుకొన్న ఐసాక్

ఐసాక్ కప్పీ హాలీవుడ్‌లో చిన్న చిన్న పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకొనేందుకు ప్రయత్నించాడు. న్యూ మెక్సికోకు చెందిన ఆయన హాలీవుడ్ బ్లాక్‌బస్టర్లలో నటించాడు. 2011లో సూపర్ హీరో ఫిలిం థోర్‌లో ఆయన పాత్రకు ప్రశంసలు లభించాయి. టెర్మినేటర్ సాల్వేషన్, కల్ట్ ఏఎంసీ సిరీస్; బ్రేకింగ్ బ్యాడ్ తదితర చిత్రాల్లో నటించాడు.

English summary
Thor actor Isaac Kappy commits suicide. He died after Jumping off a bridge on monday. The actor posted a string of ominous messages on his Instagram account before his death goes viral. Netizens gets emotional after reading his letter.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more