Don't Miss!
- News barrelakka: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన బర్రెలక్క
- Sports IPL 2024: అందుకే పృథ్వీ షా ఆడటం లేదు: సౌరవ్ గంగూలీ
- Lifestyle గుడ్ ఫ్రైడే 2024 ఎప్పుడు? క్రైస్తవులు గుడ్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటారు?మీకు తెలియని కొన్ని వాస్తవాలు
- Technology రియల్‌మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్‌లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మార్వెల్ స్టూడియోస్ మరో అద్భుతం.... థోర్-3 (ట్రైలర్)
‘థోర్: రగ్నరోక్’ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం టీజర్ తాజాగా రిలీజైంది. ‘థోర్’ గత రెండు సిరీస్ చూసిన వారికి ఈ సినిమా సరికొత్త అనుభూతిని ఇస్తుందని ఈ ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది.
లాస్ఏంజిల్స్: హాలీవుడ్లో మార్వెల్ స్టూడియో వారు వేల కోట్ల ఖర్చుతో నిర్మించే చిత్రాలకు ప్రపంచ వ్యాప్తంగా ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్పైడర్ మెన్, ఐరన్ మెన్, అవేంజర్స్, కెప్టెన్ అమెరికా ఇలా ఈ సంస్థ నుండి వచ్చే సినిమాలన్నీ విజువల్స్ పరంగా ఎంతో అద్భుతంగా ఉంటాయి.
ఈ సంస్థ నిర్మిస్తుస్తున్న చిత్రాల్లో 'థోర్' సిరీస్ సినిమాల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇప్పటికే విడుదలైన రెండు పార్ట్స్ బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా మూడో భాగం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది.
‘థోర్: రగ్నరోక్'
‘థోర్: రగ్నరోక్' పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం టీజర్ తాజాగా రిలీజైంది. ‘థోర్' గత రెండు సిరీస్ చూసిన వారికి ఈ సినిమా సరికొత్త అనుభూతిని ఇస్తుందని ఈ ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది.
క్రిస్ హెమ్స్‌వర్త్
తొలి రెండు పార్ట్స్ లో హీరోగా నటించిన క్రిస్ హెమ్స్‌వర్త్ ఈ చిత్రంలో హీరోగా నటించాడు. చేతిలో సుత్తి లాంటి ఆయుధంతో హీరో చేసే విన్యాసాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.
ప్రధాన తారాగణం
క్రిస్
హెమ్స్‌వర్త్
టామ్
హిడిల్టన్
కేట్
బ్లాంచెట్
ఐద్రస్
ఎల్బా
జెఫ్
గోల్ద్బ్లం
టెస్సా
థాంప్సన్
కార్ల్
అర్బన్
మార్క్
రఫ్ఫలో
ఆంథోనీ
హాప్కిన్స్
రిలీజ్ డేట్
వాల్ డిస్నీ సంస్థ ఈ ఏడాది నవంబర్ 3న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి Taika Waititi దర్శకత్వం వహిస్తున్నారు.