twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'ముగ్గురు మొనగాళ్ళు'గా తెలుగులో త్రీ మస్క్‌టీర్స్

    By Nageswara Rao
    |

    దశావతారం నుంచి ఉరుమి వంటి ఎన్నో వైవిధ్యమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన ఎస్‌.వి.ఆర్‌. మీడియా ప్రై. లిమిటెడ్‌ సంస్థ ఇప్పుడు మరో హాలీవుడ్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 'త్రీ మస్క్‌టీర్స్‌' పేరుతో దాదాపు 1000 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన హాలీవుడ్‌ చిత్రాన్ని 'ముగ్గురు మొనగాళ్ళు'గా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో ఆంధ్రప్రదేశ్‌ అంతటా ఎస్‌.వి.ఆర్‌. మీడియా ద్వారా ఈ చిత్రం రిలీజ్‌ కాబోతోంది.

    ఈ చిత్రం గురించి శోభారాణి మాట్లాడుతూ...'16వ శతాబ్దంలో ఫ్రెంచ్‌ రాజ్యాన్ని కబళించడానికి వచ్చిన వారిని ముగ్గురు యువకులు ఎదురిస్తాడు. 'త్రీ మస్క్‌టీర్స్‌'గా పేరు పొందిన ఆ ముగ్గురు ఫ్రెంచ్‌ రాజ్యాన్ని ఎలా కాపాడరన్నది ప్రధానాంశం. పివిఆర్‌ సినిమాస్‌ ప్రై. లిమిటెడ్‌ వారు అక్టోబర్‌ 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దాదాపు 1000 కోట్ల భారీ బడ్జెట్‌తో, టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో రియల్‌ 3డి వెర్షన్‌లో నిర్మించారు. ఆంధ్రప్రదేశ్‌ అంతటా తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో మా ఎస్‌.వి.ఆర్‌. మీడియా ద్వారా రిలీజ్‌ చేస్తున్నాం. ఈ చిత్రంలో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ వుంటాయి. స్టార్టింగ్‌ టు ఎండింగ్‌ ఎంతో క్యూరియాసిటీతో సాగే స్క్రీన్‌ప్లే మెయిన్‌ హైలైట్‌గా చెప్పొచ్చు.

    హై ఓల్టేజ్‌ యాక్షన్‌, ఎడ్వంచర్స్‌, రొమాన్స్‌ ప్రేక్షకుల్ని థ్రిల్‌ చేస్తాయి. రెసిడెంట్‌ ఈవిల్‌, డెత్‌రేస్‌ వంటి అద్భుతమైన చిత్రాల్ని రూపొందించిన ప్రఖ్యాత హాలీవుడ్‌ డైరెక్టర్‌ పాల్‌ డబ్ల్యు.ఎస్‌.ఏండర్సన్‌ 'త్రీ మస్క్‌టీర్స్‌' చిత్రాన్ని ఓ సెల్యులాయిడ్‌ వండర్‌గా తీర్చిదిద్దారు. తెలుగు ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలూ ఈ చిత్రంలో వున్నాయి. మా ఎస్‌.వి.ఆర్‌. మీడియా గతంలో చేసిన అన్ని సినిమాల్ని ప్రేక్షకులు సూపర్‌హిట్‌ చేశారు. అక్టోబర్‌ 14న ప్రపంచవ్యాప్తంగా 'త్రీ మస్క్‌టీర్స్‌'గా రిలీజ్‌ అవుతున్న ఈ చిత్రం తెలుగులో కూడా అదే రోజు 'ముగ్గురు మొనగాళ్ళు'గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తప్పకుండా ఈ చిత్రం మా బ్యానర్‌లో మరో మంచి చిత్రంగా నిలుస్తుందన్న నమ్మకం వుంది' అని అన్నారు. అలెగ్జాండర్‌ డుమాస్‌ కథ ఆధారంగా పాల్‌ డబ్ల్యు.ఎస్‌. ఏండర్సన్‌ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది.

    English summary
    The title suggests the story is of the three musketeers, the King’s guards. But the swordsmen really play more of a supporting role to the storyline of Her Majesty Queen Anne, danced by Helen Daigle, who gives her diamond necklace, a gift from the king, to the Duke of Buckingham, danced by Robert Dunbar, after falling in love with him but refusing to leave her responsibilities.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X