మీ పెళ్శి పెటాకులయ్యింది మీ ఇష్టం వచ్చినట్టు తిరగండి..?
ప్రపంచంలోనే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే వ్యక్తి 'టైగర్ వుడ్స్'. అలాంటి టైగర్ వుడ్స్ డ్రగ్స్ తీసుకుంటున్నారని, పరాయి స్త్రీలతో శారీరక సంభందాలు పెట్టుకున్నారని ఇటీవల కాలంలో వార్తల్లోకి ఎక్కారు. ఇదంతా నిజమేనని నమ్మి టైగర్ వుడ్స్ భార్య మాజీమంత్రి బార్బరో కూతురైన 'ఎలిన్ నార్డెగ్రెన్', టైగర్ వుడ్స్ నుండి విడాకులు కావాలని కోరారు. అందుకు సమ్మతించిన టైగర్ వుడ్స్ మరియు ఎలిన్ నార్డెగ్రెన్ కి పనామా సిటిలోని 'బే కోర్టు' విడాకులు మంజూరు చేసింది.
బయటకు వచ్చిన తర్వాత పీపుల్స్ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్యూలో ఎలిన్ నార్డెగ్రెన్ మాట్లాడుతూ ఇవాల్టితోటి నాకు వుడ్స్ కి ఎటువంటి సంభంధం వుండదు. ఆయన రాబోయే కాలంలో మంచి జరగాలని కోరుకుంటున్నానని ఆమె తెలిపారు. మాకు ఇద్దరు అందమైన పిల్లలు వున్నారని వాళ్శ భాధ్యత మాత్రం ఇద్దరదని అమె వివరించారు. కొన్ని రోజులు ఇద్దరకి ఇబ్బందిగానే వుంటుందని, కోత్త ఫ్యామిలి లో తోందరగానే సర్దుకుంటామని అమె తెలిపారు.
విడాకులు మంజూరుతో పాటు ఎలిన్ నార్డెగ్రెన్ తన భర్త నుండి తనకు 500మిలియన్ డాలర్లు కావాలని అడగడం తెలిసిందే. చివరకు ఎంత డబ్బులు తన భర్త నుండి తన జీవన భృతికి పోందినదో తాను చెప్పడానికి నిరాకరించారు.


Click it and Unblock the Notifications











