పిల్లలకు తన విశ్వరూపం చూపిన పులిరాజా
ప్రముఖ గోల్ఫ్ క్రీడాకారుడు టైగర్ వుడ్స్ గతంలో తాను చేసిన తప్పుకు ఇప్పుడు చాలా బాధపడుతున్నాడు. ఏకంగా 18 మందితో అక్రమసంబంధాన్ని నెరిపి తన భార్యని, తల్లిని, ఇతర కుటుంబ సభ్యులను ఎంతగా బాధపెట్టానో తలచుకుంటేనే చాలా బాధగా వుంది. వారికి ఎన్ని సార్లు క్షమాపనలు చెప్పినా తక్కువే అని మరో సారి వారికి క్షమాపనలు చెప్పాడు.
కానీ తన రాసలీల గురించి తన పిల్లలు ఏవిధంగా స్పందిస్తారోనని చాలా భయపడ్డానని కానీ ఎలాగోలా ధైర్యం చేసి వారికి వివరణ ఇచ్చుకున్నానని ఆయన చెప్పాడు. ఆ సమయంలో మీ నాన్న మానసికంగా బాగాలేడని అందుకే అలా ప్రవర్తించాడని తన పిల్లలకు చెప్పాడట. క్షమాపనలతో ఆగిపోని టైగర్ వుడ్స్ మానసిక చికిత్సాలయానికి వెళ్లి చికిత్స కూడా తీసుకుని తాను ఇప్పుడు పూర్తిగా మారిపోయానని అందరికీ తెలియజేస్తున్నాడట. చూడండి నేను ఎంత ఉల్లాసంగా వున్నానో...ఎంత ఉత్సాహంగా వున్నానో..ఎంతగా మారిపోయానో..అంటూ అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నా ఆయన మారితే చాలు అదే పదివేలు అని అతని కుటుంబసభ్యులు అభిప్రాయపడుతున్నారట.


Click it and Unblock the Notifications











