ముసలితనం రావడం వల్ల ఉద్వేగానికి లోనవుతున్నా..
హాలీవుడ్ సింగర్ జస్టిన్ టింబర్‌లేక్ ఇటీవల ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ ముసలితనం వస్తుండడంతో జీవితాన్ని సరిగా ఎంజాయ్ చేయలేకుండా పోతున్నానని అన్నారు. నేను యవ్వనంలో ఉన్న రోజులు నాకు ఇప్పటికీ గుర్తుకు వస్తున్నాయి. చూడడానికి చాలా సీరియస్గా, గర్వంగా ఉంటాను. కానీ ఇప్పడు అవన్నీ తలచుకుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది.
అందుకు కారణం యవ్వనంలో ఉన్నప్పుడు అంత రాష్‌గా ఉన్న నేను ఇప్పడు ఇంత శాంతకాముడిగా మారడానికి కారణం మాత్రం వయసు మీద పడడమేనని అనుకుంటున్నాను. అంతేకాదండి ఆ వయసులో చేసిన కొన్ని పనులు నాకు చాలా సంతోషిస్తున్నాయి. ఆ రోజులు నుండి సడన్‌గా వయసు మీద పడి శాంతంగా ఉండడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.
ఎప్పుడైతే మీలో కొపం, ఆవేశం సన్నిగిల్లుతుందో అప్పుడు మీలో ఆలోచన ధోరణి పెరగడమే కాకుండా, పెద్ద తరహా భావాలు వస్తాయని అన్నారు. దీనిని బట్టి మనకు ఏమీ అర్దం అవుతుందంటే మనకు వయసు వస్తుందని అన్నారు. కానీ సాధరణంగా మనం వయసులో పెద్ద వారమవుతున్నామనే విషయాన్ని ఒప్పుకొం. ఎవరైతే ఒప్పుకుంటారో వారిలో పెద్ద తరహా భావాలు వచ్చినట్లన్నమాట.
కానీ నాకు మరలా యవ్వన దశలోకి వెళ్లాలని ఎటువంటి కొరికలు లేవు. నాకు మాత్రం నేను యవ్వనంగానే ఉన్నానని అనుకుంటున్నాను. కానీ నాలో వస్తున్న ఈ మార్పులకు మాత్రం కొంచెం ఉద్వేగంగా ఉంది. మనస్పర్దల వల్ల జస్టిన్ టింబర్‌లేక్, జెస్సికా బెయిల్ విడిపోయిన సంగతి తెలిసిందే. ఇటీవల కెనాడాలోని టోరెంటోలో ఉన్న ఎల్లాస్ కాఫీ షాప్‌లో ఇద్దరూ కలసి కాఫీ త్రాగుతూ రొమాంటిక్‌గా ఎంజాయ్ చేస్తూ దొరికిపోయారు. వీరిద్దరి అక్కడ చూసిన అభిమానులు తెలిపిన దానిప్రకారం ఇద్దరూ కూడా మొదట్లో ఎలా ఐతే కలసి మెలసి ఉండే వారో అదే విధంగా వారియొక్క ఐడియాస్‌ని షేర్ చేసుకుంటూ సరదాగా జోకులు వేసుకుంటూ కనిపించారని సమాచారం.
చాలా రోజులు తర్వాత కలుసుకున్న వీరిద్దరిలో జస్టిన్ టింబర్‌లేక్, జెస్సికా బియిల్‌ను చూస్తూ అలానే ఉండిపోవడం జరిగిందంట. అంతేకాకుండా జస్టిన్ జెస్సికాతో మాట్లాడుతూ జీవితాంతం నీ ముఖంలో ఇలాంటి ఆనందాన్ని చూడాలని అనుకుంటున్నానని వెల్లడించాడని సమాచారం. ఇది చూసిన వాళ్శంతా త్వరలోనే వీరిద్దరూ మరలా కలసి పోతారని గుసగుసలాడుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











