త్రీడీలో కనువిందు చేయనున్న టైటానిక్...
ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను అలరించిన హాలీవుడ్ చిత్ర రాజం టైటానిక్.. ఇప్పుడు త్రీడీ సొగసులు అద్దుకుని మరోసారి కనువిందు చేయనుంది. 1912 ఏప్రిల్ 15న టైటానిక్ ఓడ నడి సముద్రంలో మునిగిపోయిన దుర్ఘటనలో 1500 మంది చనిపోయారు. దీన్నే కథాంశంగా తీసుకుని జేమ్స్ కేమెరూన్ దర్శకత్వంలో అపురూపమైన ప్రేమకథగా తెరకెక్కించిన ఈ సినిమా సంచలన విజయం నమోదు చేసుకుంది.
అప్పట్లో అత్యధికంగా 1.2 బిలియన్ డాలర్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. 2012 నాటికి టైటానిక్ షిప్ మునిగి వంద సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని త్రీడీలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇటీవలే కేమెరూన్ డైరెక్షన్లో వచ్చిన అవతార్ సెన్సేషనల్ హిట్ అయింది.
హాలీవుడ్ టైటానిక్ జేమ్స్ కేమెరూన్ లియోనార్డోడైకాప్రియో క్యాటి విన్స్ లెట్ బెల్లి జేన్ hollywood james cameron leonardo dicaprio kate winslet billy zane


Click it and Unblock the Notifications