టైటానిక్ యాక్టర్ కన్నుమూత.. విషాదంలో వరల్డ్ సినిమా!

టైటానిక్, ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రిటర్న్ ఆఫ్ ది కింగ్ చిత్రాల్లో తన నటనతో ఆకట్టుకొన్న యాక్టర్ బెర్నార్డ్ హిల్ ఇకలేరు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం ఉదయడం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 79 సంవత్సరాలు. ఆయన మృతితో ప్రపంచ సినిమా అభిమానులు తీవ్ర విషాదంలో కూరుకుపోయారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొంటూ సంతాపం ప్రకటిస్తున్నారు. ఆయన మృతికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

బెర్నార్డ్ హిల్ విషయానికి వస్తే.. గత కొద్దికాలంగా వృద్దాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. కొంతకాలంలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి ఆదివారం ఉదయం మరణించారు అని కుటుంబ సభ్యులు వార్తను వెల్లడించారు.

Titanic Fame Actor Bernard Hill died at the age of 79

ఈ రోజు అత్యంత విషాదకరం. బెర్నార్డ్ హిల్ ఇకలేరనే విషయాన్ని తెలియజేయడానికి చింతిస్తున్నాను. ఆయనతో కలిసి నేను జాన్ పాల్ జార్జడ్, బెర్ట్, విల్లీ రస్సెల్ మార్వలేస్ షో నటించాను. అతనొక గొప్ప యాక్టర్. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని నటి బార్బారా డికెన్స్ ఈ విషాద వార్తను షేర్ చేసింది.

ఇక లార్డ్ ఆఫ్ ది రింగ్స్ చిత్రంలో కింగ్ థియోడెన్‌గా, టైటానిక్ సినిమాలో కెప్టెన్ ఎడ్వార్డ్ స్మిత్‌ పాత్రల్లో అద్బుతమైన నటనను ప్రదర్శించారు. 11 ఆస్కార్లు గెలుచుకొన్న రెండు చిత్రాల్లో నటించిన ఘనతను హిల్ మాత్రమే సొంతం చేసుకొన్నారనే తన సన్నిహితులు గుర్తు చేసుకొంటున్నారు.

1982లో ఆయన నటించిన బాయ్స్ ఫ్రమ్ ది బ్లాక్స్‌స్టఫ్ చిత్రం ద్వారా పాపులారిటీ సాధించాడు. 1983 సంవత్సరంలో బ్రిటీష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్స్ టెలివిజన్ ఆర్ట్స్ అవార్డుకు నామినేట్ అయ్యారు. ఆయనకు అదే సంవత్సరం బాఫ్టా అవార్డు లభించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X