twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫిలింసిటీలో 'యమదూతలు'ను వీక్షించిన అజయ్ దేవ్‌గన్

    By Nageswara Rao
    |

    2010లో హాలీవుడ్‌లో విడుదలై బాక్సాఫీసు రికార్డుల్ని సృష్టించిన హాలీవుడ్ చిత్రం 'ఎక్స్‌పెండబుల్స్' కు సీక్వెల్‌గా వస్తున్న 'ది ఎక్స్‌పెండబుల్స్‌ 2' చిత్రాన్ని తెలుగులో 'యమదూతలు' పేరుతో లక్ష్మీగణపతి ఫిలింస్‌ సుబ్రహ్మణ్యం అందిస్తున్నారు. ఈ సినిమాని ఈరోజు (ఆగస్టు 24)న 125 ప్రింట్లతో ఆంధ్రప్రదేశ్‌లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో రాకీ, జాసన్‌ స్టాథమ్‌, జెట్లీ, డాల్‌‌పలండ్‌గ్రెస్‌, అర్నాల్‌‌డ, చెక్‌నోరిస్‌, బ్రూస్‌విల్లీస్‌, జన్‌క్లాడ్‌, వేన్‌ఎమ్మీ, టెర్రీక్రూస్‌, రాండీ కోటర్‌, వియామ్‌ హౌమ్‌వర్‌‌గ ప్రధాన పాత్రలు పోషించారు.

    ఈ సందర్భంగా నిర్మాత బి.సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ 11 మంది మాస్ యాక్షన్ హీరోలతో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి చిత్రం కంటే పది రెట్లు యాక్షన్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందన్నారు. కథాంశం గురించి చెబుతూ.. ఓ సకార్యాన్ని నెరవేర్చాలనుకున్న ఎక్స్‌పెండబుల్‌ టీమ్‌ అనుకోని అవాంతరాలను ఎదుర్కొంటుంది. శత్రువు దాడివల్ల ముఖ్య సభ్యుడ్ని కోల్పోతుంది. దాంతో టీమ్‌లో మరో ఇద్దరిని చేర్చుకుని చంపిన వాడిపై పగతీర్చుకుంటుంది. శత్రువుని చంపే క్రమంలో వివిధ ట్విస్టులతో పాటు ఈ చిత్రంలో గ్రాఫిక్స్ చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకూ అందరిని ఆకట్టుకుంటాయని అన్నాడు.

    హైదరాబాద్‌లోని రామోజీ ఫిలింసిటీలో ఈ చిత్రం ప్రత్యేక ప్రదర్శనను బాలీవుడ్ హీరో అజయ్ దేవ్ గన్ నిన్న వీక్షించారు. హాలీవుడ్‌లో 100 కోట్ల మిలియన్ డాలర్ల వ్యయంతో 11 మంది అగ్ర హీరోలతో భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌లో రూపొందించిన ఈ చిత్రాన్ని చూస్తుంటే చాలా థ్రిల్‌గా ఉందని అజయ్ దేవ్ గన్ అన్నారు. ఇంత మంది స్టార్ హీరోలతో సినిమా అంటే అది కేవలం హాలీవుడ్ లోనే సాధ్యం. ప్రపంచ సినీ చరిత్రలో ఇదొక వండర్‌గా నిలుస్తుందన్నారు.

    అభిమానులకంటే కూడా ఇండియా సినిమా ఆర్టిస్టులు సైతం చూడడానికి ఎంతో కూతూహలాన్ని ప్రదర్శిస్తారు. అభిమానుల ఎక్స్ పెక్టేషన్స్ తగ్గట్టుగా ఈ సినిమా భారీ యాక్షన్ సన్నివేశాలతో రూపొందిచారని అన్నాడు.

    మాటలు: మైథిలి కిరణ్
    నిర్మాతలు: డి.సుబ్రహ్మణ్యం, ఎస్.సురేష్
    స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సైమన్ వెస్ట్

    తెలుగు వన్ఇండియా

    English summary
    The sequel to the 2010 action movie The Expendables releases in India today. The film revolves around the mercenary group The Expendables who are on a revenge mission against rival mercenary Jean Vilain who murdered one of their group members and threatens the world with a deadly weapon.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X