twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాలీవుడ్‌లో విషాదం: ప్రముఖ నిర్మాత కన్నుమూత.. సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ వరకు!

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఎంతో మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు కరోనా సమయంలో కన్నుమూశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రముఖ నిర్మాత, డిస్ట్రీబ్యూటర్, మాజీ ఎమ్మెల్యే అయిన దొరస్వామి రాజు మరణించారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఇబ్బందులు పడుతోన్న ఆయన.. హైదరాబాద్‌లోని ప్రముఖ ఆస్పత్రిలో చికిత్ర పొందుతున్నారు. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం ఆయన తుది శ్వాసను విడిచారు. సీనియర్ ప్రొడ్యూసర్ మరణంతో చిత్ర సీమలో విషాదం అలముకుంది. ఆయన మృతిపై ఎంతో మంది సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

    డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్‌ను ఆరంభించారు దొరస్వామి రాజు. ఈ క్రమంలోనే 'విజయమల్లేశ్వరి కంబైన్స్' సంస్థ పేరిట 'సింహబలుడు' నుంచి 'డ్రైవర్ రాముడు', 'వేటగాడు', 'యుగంధర్', 'గజదొంగ', 'ప్రేమాభిషేకం', 'కొండవీటి సింహం', 'జస్టిస్ చౌదరి' వంటి ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాలను పంపిణీ చేశారు. ఈ క్రమంలోనే నిర్మాతగానూ మారారు. 'కిరాయి దాదా', 'సీతారామయ్య గారి మనవరాలు', 'ప్రెసిడెంట్‌గారి పెళ్లాం', 'అన్నమయ్య', 'సింహాద్రి', 'భలే పెళ్ళాం', 'వెంగమాంబ' వంటి అద్భుత చిత్రాలను ఆయన నిర్మించారు. దీంతో మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్‌గా పేరొందారు.

    Tollywood Producer VMC Doraswamy Raju Passes Away

    సుదీర్ఘ కాలంలో సినీ రంగానికి విశిష్ట సేవలు అందించిన దొరస్వామి రాజు.. ఇతర రంగాల్లోనూ తన మార్క్ చూపించారు. మరీ ముఖ్యంగా 1994లో చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన.. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుకు మెంబర్‌గానూ వ్యవహరించారు. దీంతో ఆయన తెలుగు రాష్ట్రాల్లోనే కాక, దేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యారు. ఇదిలా ఉండగా, వయసు మీద పడడంతో కొన్నేళ్లుగా ఆయన సినీ రంగానికి దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అనారోగ్యానికి గురైన దొరస్వామి రాజు.. తాజాగా కన్ను మూశారు.

    English summary
    Producer V Doraswamy Raju passes away. By TeluguCinema. January 18, 2021. News. Senior producer and distributor V.Doraswamy Raju is no more. He died of cardiac arrest. He breathed his last on Monday morning at Care Hospital in Banjara Hills in Hyderabad. He was known for producing classics like ‘Seetharamayya Gari Manavaralu’ and ‘Annamayya’.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X