twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టామ్ అండ్ జెర్రీ దర్శకుడు కన్నుమూత..

    |

    అమెరికన్ ఆస్కార్ అవార్డు గ్రహీత, చిత్రకారుడు, యానిమేటర్, సినీ దర్శకుడు, నిర్మాత జీన్ డీచ్ ఇక లేరు. వృద్దాప్య సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఆయన శుక్రవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 95 సంవత్సరాలు. ఆయన మృతికి పలువురు హాలీవుడ్ ప్రముఖులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తంచేశారు.

    జీన్ డీచ్‌ మరణ వార్తను ఆయన సన్నిహితుడు, చెక్ ప్రచురణకర్త పీటర్ హిమ్మేల్ తెలియజేశారు. శుక్రవారం తెల్లవారు జామున నిద్రలోనే పరలోకానికి వెళ్లిపోయారు అని తెలిపారు.

    Tom and Jerry director Gene Deitch no more

    టామ్ అండ్ జెర్రీ సంబంధించిన 13 ఎపిసోడ్లకు ఆయన దర్శకత్వం వహించారు. అలాగే పోప్‌ఐ: ది సాయిలర్ మ్యాన్ సిరీస్‌కు కూడా దర్శకత్వ బాధ్యతలను చేపట్టారు. 1960లో ఆయన రూపొందించిన మున్రో యానిమేషన్ మూవీకి ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిలింగా అవార్డు దక్కింది.

    1924 ఆగస్గులో 8 తేదీన జీన్ డీచ్ జన్మించారు. 1959లో వెళ్లిన సమయంలో డెంకాతో ప్రేమలో పడ్డారు. తన ప్రియురాలు డెంకాను వివాహం చేసుకొన్న తర్వాత ప్రాగ్‌లోనే ఆయన స్థిరపడ్డారు. డెంకా, మొదటి భార్య మేరికి పుట్టిన ముగ్గురు కుమారులను ఆయన కలిగి ఉన్నారు.

    English summary
    Popular animated film Tom and Jerry director Gene Deitch no more. He died at the age of 95. Deitch is survived by Zdenka and three sons from his previous marriage to Marie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X