కొడుకు పెళ్లికి దూరంగా హీరోయిన్.. మాజీపై నిషేధంతో విలన్‌గా మారిన హీరో
హాలీవుడ్ హీరో టామ్ క్రూయిజ్ కుమారుడు కానర్ వివాహం త్వరలోనే జరుగనున్నది. ఈ వేడుకకు తల్లి, హీరోయిన్ నికోల్ కిడ్మన్ దూరంగా ఉంచాలని టామ్ నిర్ణయించుకోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ పెళ్లికి సంబంధించిన వార్త ప్రస్తుతం హాలీవుడ్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పెళ్లికి కిడ్మన్‌ను ఎందుకు దూరంగా ఉంచాలనుకోవడం వెనుక అసలు విషయం ఏమిటంటే...

పెళ్లి వేడుకకు దూరంగా
తన మాజీ భార్య నికోల్ కిడ్మన్‌ను పెళ్లికి దూరంగా ఉంచాలని టామ్ క్రూయిజ్ నిర్ణయం తీసుకోవడంతో కుమారుడు కూడా వ్యతిరేకించలేదు. తండ్రి మాటను జవదాటని కొడుకు తండ్రి ఇష్టానికే వదిలేశారట. తండ్రి ఇష్టప్రకారమే పెళ్లి చేసుకోవాలని కానర్ డిసైడ్ అయ్యారనేది తాజా సమాచారం.

2001లో విడాకులు మంజూరు
హాలీవుడ్‌లో కెరీర్ జోరుగా ఉండగానే టామ్ క్రూయిజ్, కిడ్మన్ 1990లో వివాహం చేసుకొన్నారు. ఆ సమయంలో ఇద్దరు పిల్లలను దత్తత తీసుకొన్నారు. వారికి కానర్, ఇసాబెల్లా అని నామకరణం చేశారు. 2001 వరకు దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేశారు. వ్యక్తిగత విభేదాలు రావడంతో ఈ స్టార్ దంపతులు ఆ తర్వాత విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకొన్నారు.

పిల్లల సంరక్షణ టామ్ క్రూయిజ్‌కే
టామ్, కిడ్మన్ పరస్పర అంగీకారం తెలపడంతో కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. ఆ తర్వాత పిల్లల సంరక్షణ బాధ్యత టామ్ క్రూయిజ్ తీసుకొన్నారు. వారికి విద్యాబుద్దులు నేర్పించి వారిని శాస్త్రవేత్తలుగా తయారు చేశారు. ప్రస్తుతం జీవితంలో స్థిరపడిన కానర్ ప్రేమలో పడి సిలివియాను వివాహం చేసుకొంటున్నాడు.

కిడ్మన్‌పై నిషేధం వివాదంగా
అయితే కొడుకు పెళ్లికి తల్లిని దూరంగా టామ్ క్రూయిజ్ ఎందుకు పెట్టాలనుకొన్నారనే విషయం వివాదంగా మారింది. వారి మధ్య నెలకొన్న అభిప్రాయ భేదాల వల్లే ఆమెపై కుటుంబ వ్యవహారాల్లో తలదూర్చకుండా నిషేధం ప్రకటించారని హాలీవుడ్ మీడియా కథనాలను ప్రచురించింది.


Click it and Unblock the Notifications











