Tom Cruise హాలీవుడ్‌లో అత్యధిక పారితోషికంతో రికార్డు.. టామ్ గన్ మూవీకి రెమ్యునరేషన్ ఎంతంటే?
ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం అందుకొంటున్న నటుల్లో హాలీవుడ్ నటుడు టామ్ క్రూయిజ్ చేరారు. ఇప్పటి వరకు హాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం అందుకొన్న నటుడిగా విల్ స్మిత్ పేరు ఉండేది. ప్రస్తుతం టాప్ గన్: మావెరిక్ చిత్రంతో టామ్ క్రూయిజ్ అత్యధిక పారితోషికం అందుకొంటున్న నటుడిగా రికార్డును క్రియేట్ చేశారు. టామ్ క్రూయిజ్ రెమ్యునరేషన్ ఎంత? టాప్ గన్ సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకొన్నారనే విషయాల్లోకి వెళితే..

9.6 వేల కోట్ల వసూళ్లు
టామ్ క్రూయిజ్ నటించి, నిర్మించిన చిత్రం టాప్ గన్: మావ్‌రిక్ చిత్రం మే నెలలో ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ చిత్రం ప్రపంచ బాక్సాఫీస్ వద్ద 1.2 బిలియన్ డాలర్లు అంటే దాదాపు 9.6 వేల కోట్ల రూపాయలు వసూలు చేసింది. కోవిడ్ పరిస్థితుల తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో టాప్ గన్ ఒకటిగా నిలిచింది.

100 మిలియన్ల పారితోషికం
టాప్ గన్ చిత్రం విజయం సాధించడంతో పారామౌంట్ పిక్చర్స్‌కు లాభాల పంట పడింది. దాంతో ఈ చిత్ర లాభాల్లో నుంచి పర్సెంటేజ్ ప్రకారం టామ్ క్రూయిజ్‌కు భారీ రెమ్యునరేషన్ దక్కింది. ఈ సినిమాకు ఆయనకు సుమారు 100 మిలియన్ అమెరికన్ డాలర్లు అంటే.. 800 కోట్ల రూపాయల పారితోషికం అందినట్టు హాలీవుడ్ పత్రిక వెరైటీ తన కథనంలో వెల్లడించింది.

రెండోస్థానంలో విల్ స్మిత్
ఇక హాలీవుడ్‌లో టామ్ క్రూయిజ్ తర్వాత అత్యధిక పారితోషికం అందుకొన్న నటుల్లో విల్ స్మిత్, డ్వెయిన్ జాన్సన్ ఉన్నారు. ఎమానిసిపేషన్ సినిమా కోసం విల్ స్మిత్‌కు 35 మిలియన్ డాలర్ల పారితోషికం లభించింది. ఇక ఆ తర్వాత బ్లాక్ ఆడమ్ సినిమాకు 22.5 మిలియన్ డాలర్ల పారితోషికం అందుకొని.. డ్వేయిన్ జాన్సన్ అత్యధిక రెమ్యునరేషన్ అందుకొన్న హాలీవుడ్ నటుల్లో మూడో స్థానంతో సరిపెట్టుకొన్నారు.

నాలుగో స్థానంలో లియోనార్డ్
హాలీవుడ్‌లో కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ అనే సినిమా కోసం లియోనార్ఢ్ డికప్రియో సుమారు 30 మిలియన్ డాలర్ల రెమ్యునరేషన్ అందుకొన్నారు. ఫార్మూలా 1 కథా నేపథ్యంగా తెరకెక్కుతున్న.. ఇంకా పేరు పెట్టిన చిత్రంలో నటించినందుకు బ్రాడ్ పిట్‌కు 30 మిలియన్ల డాలర్లు పారితోషికంగా ఇచ్చినట్టు వెరైటీ కథనంలో పేర్కొన్నది.

హాలీవుడ్‌లో హయ్యెస్ట్ పెయిడ్ యాక్టర్లు
హాలీవుడ్‌లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకొంటున్న వారిలో లియోనార్డో డికప్రియో, బ్రాడ్ పిట్, క్రిస్ హెమ్స్‌వర్త్, విన్ డీజిల్, జోకర్ 2 ఫేమ్ జాక్విన్ ఫొనిక్స్, వెనోమ్ 3 ఫేమ్ టామ్ హార్డీ, తదితరులు ఉన్నారు.


Click it and Unblock the Notifications











