37 ఏళ్ల హీరోయిన్‌తో పట్టుబడ్డ టామ్ క్రూయిజ్.. సహజీవనం రూమర్ల మధ్య..
హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూయిజ్ 10వ సారి ప్రేమలో పడ్డారు. అయితే తనకంటే చాలా తక్కువ వయసు ఉన్న భామతో రొమాంటిక్ లైఫ్‌ను గడుపుతుండటం ఇంటర్నేషనల్ మీడియాలో చర్చనీయాంశమైంది. గత కొద్దికాలంగా వారిద్దరూ డేటింగ్ చేస్తున్నారనే రూమర్లు మీడియాలో హల్‌చల్ చేశాయి. అయితే ఈ ఇద్దరు ప్రేమపక్షుల్లా ఒకరి చేతిలో మరొకరు చేయి వేసుకొని తిరుగుతూ మీడియా కంటపడటం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. అయితే ఈ ఇద్దరి ప్రేమ కథ, డేటింగ్, లివింగ్ టుగెదర్ లైఫ్ విషయంలోకి వెళితే..
63 ఏళ్ల టామ్ క్రూయిజ్ మ్యారేజ్ లైఫ్ విషయానికి వస్తే.. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు జరగడం.. ఆ తర్వాత విడాకులు తీసుకోవడం జరిగిపోయింది. టామ్ తొొలి వివాహం మిమి రోజర్స్‌తో 1987 సంవత్సరంలో జరిగింది. దాదాపు మూడేళ్ల దాంపత్య జీవితం తర్వాత వారిద్దరూ విడపోయారు. అనంతరం నటి నికోల్ కిడ్మన్‌ను రెండో వివాహం చేసుకొన్నారు. 1990 నుంచి 2001 వరకు అంటే 11 ఏళ్ల పాటు వారిద్దరి వైవాహిక జీవితం కొనసాగింది. ఆ తర్వాత హీరోయిన్ క్యాటీ హోమ్స్‌ను 2006 సంవత్సరంలో వివాహం చేసుకొన్నాడు. 6 ఏళ్లపాటు దాంపత్య జీవితం ముగిసిన తర్వాత మూడోసారి విడాకులు తీసుకొన్నాడు.

ముగ్గురితో విడాకులు తీసుకొన్న తర్వాత క్యూబన్, స్పానిష్ నటి అన్నా అర్మాస్ కాసోతో డేటింగ్ చేస్తున్నారనే వార్తలు ఇటీవల తెగ ప్రచారం జరిగాయి. ఆమె వయసు 37 సంవత్సరాలు. అయితే కొద్ది నెలలుగా టామ్, అర్మాస్ మధ్య అఫైర్ కొనసాగుతున్నది. వారిద్దరూ కలిసి జీవిస్తున్నారనే వార్తలు వైరల్ అయ్యాయి. వాటి గురించి ఇద్దరు స్పందించలేదు. ఆ వార్తలను ఖండించలేదు. తీరా కట్ చేస్తే ఇద్దరు కలిసి వెకేషన్ చేస్తూ మీడియా కంటికి చిక్కారు.
అమెరికాలోని వెర్మాంట్ పట్టణంలో టామ్ క్రూయిజ్ ఆర్మాస్ ఇద్రు కలిసి ఏకాంతంగా సమయాన్ని గడుపుతూ కనిపించారు. ఇద్దరు ఈ ప్రపంచాన్ని మరిచిపోయి అతి సన్నిహితంగా కలిసి నడుస్తూ తమ బంధాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. టామ్ క్రూయిజ్ నేవీ టీ షర్ట్, డెనిమ్ ప్యాంట్ వేసుకొని నెత్తిపై బేస్ బాల్ క్యాప్‌తో కనిపించారు. అర్మాస్ వైట్ టీ షర్ట్ వేసుకొని, బ్లాక్ పాయింట్ వేసుకొని కనిపించారు. ఈ ఇద్దరు నేషనల్ పార్క్ వద్ద కనిపించి ఫ్యాన్స్‌కు పండగ వాతావరణాన్ని పంచారు.
ఇంతకు ముందు వారిద్దరూ లండన్‌లోని వెంబ్లే స్టేడియంలోని ఒయాసిస్ కాన్సర్డ్‌లో కనిపించడంతో వారిద్దరి డేటింగ్ వ్యవహారం మీడియాలో బలమైన కథనాలు వినిపించాయి. వారిద్దరి మధ్య కనిపించిన కెమిస్ట్రీ అందర్నీ ఆకట్టుకొన్నది. దాంతో ఆ ఇద్దరు మధ్య బలమైన బంధం ఏర్పడిందనే ఊహాగానాలు మీడియాలో వచ్చాయి.
ఇదిలా ఉండగా, టామ్ క్రూయిజ్ ఇటీవల మిషన్ ఇంపాజిబుల్: ది ఫైనల్ రెకానింగ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు క్రిస్టఫర్ మెక్‌క్వారీ దర్శకత్వం వహించారు. హేయిలీ ఎట్‌వెల్, వింగ్ రేమేస్, సైమన్ పెగ్ నటించారు.


Click it and Unblock the Notifications











