లవర్‌తో పట్టుబడ్డ స్టార్ హీరో కూతురు.. డేటింగ్‌కు వెళ్లి ముద్దులు, కౌగిలింతలతో రెడ్ హ్యాండెడ్‌గా!
సినీ తారలంటేనే కాదు.. వారి పిల్లల జీవితాల గురించి విషయాలు మీడియాలో కనిపిస్తే ఆసక్తిగా అభిమానులు దృష్టిపెడుతారు. అయితే దాదాపు మీడియా కంట పడకుండా పిల్లలు తమ ప్రైవేట్ లైఫ్‌ను జాగ్రత్త పడుతారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్నప్పటికీ.. వారు మాత్రం మీడియా కెమెరాలకు చిక్కడం సహజమే. అలా స్టార్ హీరో కూతురు తన ప్రియుడికి ముద్దులు పెడుతూ చిక్కిపోయింది. ఈ వివరాల్లోకి వెళితే...
హాలీవుడ్‌లో సూపర్ స్టార్ టామ్ క్రూజ్‌కు గారాల ముద్దుల కూతురు ఉంది. ఆమె పేరు సూరీ క్రూజ్. హీరోయిన్ కేట్ హోమ్స్‌కు పుట్టిన సూరీ ఇటీవల హాలీవుడ్ మీడియాలో హెడ్‌లైన్లను ఆకర్షించారు. ఆమె తన బాయ్‌ఫ్రెండ్ టోబీ కోహెన్‌తో ప్రైవేట్ పార్టీ చేసుకొంటూ మీడియా కంటికి చిక్కారు. ఇంకా ఏముంది ఆమె ఫోటోలు వైరల్ అయ్యాయి.

న్యూయార్క్‌లోని ఓ హైస్కూల్‌లో చదువుతున్న సూరీ తాజాగా అదే నగరంలోని సెంట్రల్ పార్క్‌లో తన ప్రియుడితో సన్నిహితంగా ఉంటూ కనిపించింది. ఒకరికొకరు ముద్దులు పెట్టుకొంటూ పరవశంలో ముగిపోయారు. దాంతో టామ్ క్రూజ్ కూతురు పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిందనే విషయంపై రూమర్లు, గాసిప్స్ వెల్లువెత్తాయి.

తల్లి పోలీకలు ఉన్న సూరీ క్రూజ్ మాత్రం అందంగా మెరిసిపోయింది. ఆమె మిడ్డీ వేసుకొని గ్లామర్ పంట పండించింది. కౌగిలింతలు, ముద్దులతో కనివిందు చేసింది. చేతిలో చేయి వేసుకొని సన్నిహితంగా ఉండటం మీడియా కంటపడింది. ఓ ప్రత్యేక సందర్భంగా తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకొంటూ ఎంజాయ్ చేస్తూ కనిపించింది. ఇప్పుడు సోషల్ మీడియాలో వారి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉండగా, టామ్ క్రూజ్, కేటీ హోమ్స్ ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. ఆరేళ్ల క్రితం పాటు దాంపత్య జీవితాన్ని కొనసాగించిన తర్వాత 2012లో విడిపోయారు. అప్పటి నుంచి సూరీ తండ్రి సంరక్షణలోనే పెరుగుతున్నది. తాజాగా ఇలా కనిపించడంతో మీడియాలో ఆమె పేరు మార్మోగిపోయింది.


Click it and Unblock the Notifications











