Don't Miss!
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Sports ఆ చెత్త నిర్ణయమే ఆర్సీబీ కొంపముంచింది- ఫించ్
- News ముందస్తుగానే ఏపీ ఎన్నికల ఫలితాలు - గెలుపెవరిది..!!
- Finance Debt Free: అప్పుల ఊబి నుంచి త్వరగా బయటపడాలా..?? ఇవిగో 5 మార్గాలు..
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
సినిమా కోసం అంతరిక్షయానం.. టామ్ క్రూజ్ రేంజ్ అదే!!
హాలీవుడ్ సినిమాల రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులోనూ టామ్ క్రూజ్ సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులుంటారు. హాలీవుడ్లో తెరకెక్కించే కథలు ఎలా ఉంటాయి..ఎంత అడ్వాన్స్‌గా ఉంటాయో అందరికీ తెలిసిందే. వారి ఆలోచన కూడా అదే రేంజ్లో ఉంటుంది. అందుకే వారి సినిమాలు ప్రపంచాన్ని ఏలేస్తుంటాయి. టాప్ గన్, మిషన్ ఇంపాజిబుల్ వంటి సినిమాలతో ఎంతో మంది ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడు.
తాజాగా టామ్ క్రూజ్ మరో ప్రయోగానికి తెరదీశాడు. ఏకంగా అంతరిక్షంలో సినిమాలను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ మేరకు స్పేస్ ఎక్స్ సంస్థ సీఈవో ఎలన్ మస్క్‌తో సంప్రదింపులు జరుగుతున్నాయి కూడా. దాదాపు ఈ మేరకు అంతా సిద్దమైనట్టు కనిపిస్తోంది. ఇక అంతరిక్షంలో షూటింగ్ జరగబోయే మొదటి చిత్రంగా, హీరోగా టామ్ క్రూజ్ సంచలనం సృష్టించబోతోన్నట్టు కనిపిస్తోంది.
మామూలుగా ఈ స్పేస్ కాన్సెప్ట్, అంతరిక్షంలో షూటింగ్ చేద్దామని జేమ్స్ కామెరూన్‌తో సినిమా చేద్దామని ప్రయత్నించారు. దాదాపు పదిహేనేళ్ల క్రితమే ఈ కాన్సెప్ట్‌ను ఆలోచించారట. కానీ అది వర్కౌట్ కాలేదు. కానీ ఇప్పుడు మాత్రం టామ్ క్రూజ్ మాత్రం అంతరిక్షంలోకి వెళ్లబోతోన్నట్టు తెలుస్తోంది.