twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినిమా కోసం అంతరిక్షయానం.. టామ్ క్రూజ్ రేంజ్ అదే!!

    |

    హాలీవుడ్ సినిమాల రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులోనూ టామ్ క్రూజ్ సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులుంటారు. హాలీవుడ్‌లో తెరకెక్కించే కథలు ఎలా ఉంటాయి..ఎంత అడ్వాన్స్‌గా ఉంటాయో అందరికీ తెలిసిందే. వారి ఆలోచన కూడా అదే రేంజ్‌లో ఉంటుంది. అందుకే వారి సినిమాలు ప్రపంచాన్ని ఏలేస్తుంటాయి. టాప్ గన్, మిషన్ ఇంపాజిబుల్ వంటి సినిమాలతో ఎంతో మంది ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడు.

    తాజాగా టామ్ క్రూజ్ మరో ప్రయోగానికి తెరదీశాడు. ఏకంగా అంతరిక్షంలో సినిమాలను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ మేరకు స్పేస్ ఎక్స్ సంస్థ సీఈవో ఎలన్ మస్క్‌తో సంప్రదింపులు జరుగుతున్నాయి కూడా. దాదాపు ఈ మేరకు అంతా సిద్దమైనట్టు కనిపిస్తోంది. ఇక అంతరిక్షంలో షూటింగ్ జరగబోయే మొదటి చిత్రంగా, హీరోగా టామ్ క్రూజ్ సంచలనం సృష్టించబోతోన్నట్టు కనిపిస్తోంది.

    Tom Cruise Going To SPace To Shoot Film

    మామూలుగా ఈ స్పేస్ కాన్సెప్ట్, అంతరిక్షంలో షూటింగ్ చేద్దామని జేమ్స్ కామెరూన్‌తో సినిమా చేద్దామని ప్రయత్నించారు. దాదాపు పదిహేనేళ్ల క్రితమే ఈ కాన్సెప్ట్‌ను ఆలోచించారట. కానీ అది వర్కౌట్ కాలేదు. కానీ ఇప్పుడు మాత్రం టామ్ క్రూజ్ మాత్రం అంతరిక్షంలోకి వెళ్లబోతోన్నట్టు తెలుస్తోంది.

    English summary
    Tom Cruise Going To SPace To Shoot Film, To shoot a film. As per a report by Hackaday, the Mission Impossible and Top Gun star would be flying to the,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X