భార్యతో విడాకులు: ఆ విషయంలో భయపడుతున్న స్టార్ హీరో?

హాలీవుడ్ హాటెస్ట్, హాండ్సమ్ స్టార్లలో టామ్ క్రూయిజ్ ఒకరు. వెండి తెరపై ఒళ్లుగగుర్చొడిచే యాక్షన్ విన్యాసాలు చేసే ఈ హీరో రొమాంటిక్ సీన్లు పండించడంలోనూ తనకు తానే సాటి. రియల్ లైఫ్‌లో ఇప్పటికే 3 వివాహాలు చేసుకోవడంతో పాటు వారితో విడాకులు కూడా తీసుకున్న ఈ అగ్ర నటుడు ప్రస్తుతం ఒంటరిగానే ఉంటున్నాడు.

టామ్ క్రూయిజ్ చివరిసారిగా నటి కేటీ హోమ్స్‌ను పెళ్లాడారు. 2006లో వీరి వివాహం జరిగింది, 2012లో విడిపోయారు. ప్రస్తుతం కేటీ హోమ్స్ .. మరో హాలీవుడ్ నటుడు జోమీ ఫాక్స్‌తో రిలేషన్ షిప్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. తరచూ అతడితో కలిసి బయట కనిపిస్తుండటంతో వీరి 'సం'బంధం నిజమే అని తేలిపోయింది.

ఇన్నేళ్లయినా ఆడ వాసనకు దూరంగా...

ఇన్నేళ్లయినా ఆడ వాసనకు దూరంగా...

అయితే విడాకులై ఇన్నేళ్లయిన కూడా టామ్ క్రూయిజ్ ఏ మహిళతోనూ డేటింగ్ చేయడం లేదు, ఇన్నేళ్లైనా అతడు అడవాసన తగలకుండా ఎలా ఉండగలుగుతున్నాడు? దీని వెనక కారణం ఏమి అనేది హాలీవుడ్ సర్కిల్‌లో హాట్ టాపిక్ అయింది.

వారితో ఎదురైన అనుభవాలే కారణమా?

వారితో ఎదురైన అనుభవాలే కారణమా?

కేటీ హోమ్స్‌తో విడాకుల తర్వాత... మహిళలతో ప్రేమలో పడటం, వారితో సంబంధం పెట్టుకోవడంపై టామ్ క్రూయిజ్ విరక్తి చెందాడని, అందుకే మళ్లీ ఎవరితో ప్రేమలో పడాలన్నా భయపడుతున్నాడని, జీవితాంతం సింగిల్‌గానే ఉండాలని నిర్ణయించుకున్నాడని ఆయనకు సన్నిహితంగా ఉండే కొందరు చెబుతున్నమాట.

అంతా రహస్యంగా

అంతా రహస్యంగా

టాప్ క్రూయిజ్ తన వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా రహస్యంగా ఉంచుకోవడానికి ఇష్టపడతారని, అతడు కొందరు మహిళలతో క్యాజువల్ డేటింగ్ చేస్తున్నాడు, అతడికి ఇప్పటి వరకు స్థిరమైన గర్లఫ్రెండ్ అంటూ ఎవరూ లేరని కొందరు అంటున్నారు.

వృత్తికే టాప్ ప్రియారిటీ

వృత్తికే టాప్ ప్రియారిటీ

టామ్ క్రూయిజ్ తన ప్రొఫెషన్ విషయంలో చాలా నిక్కచ్చిగా ఉంటారు. తన సినిమా కెరీర్‌ విషయంలో చాలా సిన్సియర్‌గా ఉంటారు. తన జీవితంలో అన్నింటికంటే టాప్ ప్రియారిటీ ఇచ్చేది సినిమాలకే. అతడికి అమ్మాయిలు దూరం కావడానికి అది కూడా ఓ కారణం అయుండొచ్చనే వాదన కూడా ఉంది.

టామ్ క్రూయిజ్

టామ్ క్రూయిజ్

గతేడాది ‘మిషన్ ఇంపాజబుల్-ఫాలౌట్' సినిమాతో ప్రేక్షకులను అలరించిన టామ్ క్రూయిజ్ ప్రస్తుతం ‘టాప్ గన్-మావెరిక్' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి నిర్మాత కూడా ఆయనే. జోసెఫ్ కొసిన్క్సి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ 2020లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X